ఆడవారి తాళిబొట్టు ఆ షేప్ లోనే ఎందుకు ఉంటుంది..? దీని వెనుక అర్ధం ఏమిటంటే..?

ఆడవారి తాళిబొట్టు ఆ షేప్ లోనే ఎందుకు ఉంటుంది..? దీని వెనుక అర్ధం ఏమిటంటే..?

by Anudeep

Ads

భారతీయ వివాహ సంప్రదాయం లో మంగళసూత్రాలు ఉన్న ప్రాముఖ్యత గురించి తెలిసిందే. ఎంతో పవిత్రమైన ఈ సంప్రదాయం ప్రపంచ దేశాలకు ఆదర్శం. కానీ,నేటి యువత పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి భారత వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని కించపరుస్తోంది. ఏ దేశం లోను లేని సంస్కృతి భారతీయుల సొంతం.

Video Advertisement

భారత వివాహాల్లో మంగళసూత్రాలదే ప్రధమ ప్రాధాన్యత. తాళి బొట్టుని కట్టిన తరువాతే వివాహమైనట్లు భావిస్తారు. ఆ తరువాత అగ్ని సాక్షి గా ఏడడుగులు నడిచి వివాహబంధాన్ని ప్రారంభిస్తారు.

talibottu 1

మీరెప్పుడైనా గమనించారా..? ఆడవారికి మంగళ సూత్రాలలో రెండు బిళ్ళలు ఉంటాయి. ఇవి ఒకటి పుట్టింటి వారు పెట్టేది మరొకటి అత్తింటి వారు పెట్టేది. ఈ రెండు ఆడవారి వక్షస్థల భాగాలను పోలి ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయి..? అన్న సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా..? అయితే.. సమాధానం తెలియాలంటే ఈ ఆర్టికల్ ను చదివేయండి.

talibottu 2

ఒకప్పటి కాలంలో ఆడవారి రొమ్ము భాగాలను పవిత్రంగా భావించే వారు. అంతే కాదు.. వాటిని కప్పి ఉంచుకోవాలన్న నిబంధనలు లాంటివి ఏమీ ఉండేవి కాదు. ఆడువారు వాటిని కప్పుకోకుండానే తిరిగేవారు కూడా. ఎందుకంటే అప్పట్లో పిల్లలకు పాలు ఇవ్వడానికి రొమ్ము భాగం ఒక్కటే ఆధారంగా ఉండేది. ఇప్పటిలా రకరకాల పాల ప్యాకెట్లు, చిన్న పిల్లల కోసం పాలు ప్రత్యేకంగా దొరకడం అంటూ ఉండేది కాదు. అందుకే వాటిని గౌరవిస్తూ ఉండేవారు. అవి కనిపించినంత మాత్రాన పురుషులు స్త్రీలను ఇబ్బంది పెట్టడం వంటివి కూడా ఉండేవి కాదు.

talibottu 3

మరో ముఖ్యమైన విషయమేమిటంటే భారత దేశంలో చాలా మంది మంగళ సూత్రాలను అమ్మ వారి రూపంగా భావిస్తూ ఉండేవారు. అందుకే తాళి బొట్టు పై కొందరు అమ్మవారి రూపుని కూడా వేయించుకుంటూ ఉంటారు. ఆడవారి రొమ్ముకి ఆ పవిత్రతని ఆపాదించడం కోసమే.. తాళి బొట్టుని కూడా ఆ షేప్ లో ఉండే విధంగా నియమం తీసుకొచ్చారు. మన పెద్దలు ఏది చెప్పినా.. దాని వెనుక ఓ అర్ధం, పరమార్ధం ఉంటుంది అనడానికి ఇదో ఉదాహరణ.


End of Article

You may also like