ట్రైన్ పైన ఈ ప్లేట్స్ ఎందుకు ఉంటాయో తెలుసా..? అసలు కారణం ఇదే..!

ట్రైన్ పైన ఈ ప్లేట్స్ ఎందుకు ఉంటాయో తెలుసా..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

రైలు ప్రయాణం అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. హాయిగా విండో సీట్ దొరికితే.. మొబైల్ లో కావాల్సినంత ఛార్జింగ్ ఉంటె.. ఎంత దూరం అయినా వెళ్లిపోవడానికి ఇష్టపడేవాళ్లు ఉంటారు. దూర ప్రయాణాలలో ఎక్కువ కంఫర్ట్ తో ప్రయాణించాలి అని అనుకునే వారు ఎక్కువగా రైలు ప్రయాణాలనే ఎంచుకుంటూ ఉంటారు.

Video Advertisement

train plates 3

అయితే.. ఒక ట్రైన్ లో ఎక్కిన ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్నీ పరిశీలించి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు. ఈ ట్రైన్ పై ప్లేట్స్ పెట్టడం కూడా ప్రయాణికుల సురక్షితం కోసమే.. అర్ధం కాలేదా…? అసలు ఈ ప్లేట్స్ వల్ల ఉపయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం.

train plates 1

సాధారణంగా ఒక ట్రైన్ లో వెయ్యి మందికి పైగా ప్రయాణిస్తారు. కేవలం రిజర్వేషన్ ఉన్నవారే ఇంతమంది ఉంటారు. ఇక జనరల్ టికెట్ బుక్ చేసుకుని ఎక్కే వారి సంఖ్యను చెప్పలేము. మరి ఒక ట్రైన్ లో ఇంతమంది ఎక్కినప్పుడు కచ్చితం గా వారి ఉచ్వాస నిశ్వాసల వలన ట్రైన్ బోగీలలో వేడి పెరుగుతుంది. ట్రైన్ పై ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ క్రమం లో ట్రైన్ బ్యాలన్స్ తప్పే అవకాశం ఉంటుంది.

train plates 2

అందుకే ట్రైన్ పైన వెంటిలేషన్ కోసం హోల్స్ ను ఏర్పాటు చేస్తారు. వీటిని రూఫ్ వెంటిలేటర్స్ అని పిలుస్తారు. ఐతే.. ఈ హోల్స్ ని అలాగే వదిలేస్తే.. వర్షం పడినప్పుడు నీరు లోపలకి వచ్చేస్తుంది. అందుకే ఈ వెంటిలేషన్ హోల్స్ పైన ప్లేట్స్ ని పెడతారు. నిజానికి ట్రైన్స్ లో ఉండే కిటికీల వలన కూడా ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది. కానీ.. ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు ఉన్నప్పుడు.. లేదా వర్షం పడుతున్నప్పుడు కిటికీలు మూసేసినప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఈ రూఫ్ వెంటిలేటర్స్ ను ఏర్పాటు చేసారు.


End of Article

You may also like