Ads
రైలు ప్రయాణం ఎవరికైనా అందమైనదే.. అందరూ ట్రైన్ జర్నీని ఆస్వాదిస్తారు. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఇదే ఉత్తమ సాధనం. తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అంతే కాకుండా సుఖ వంతంగా ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. అందుకే లాంగ్ జర్నీలు అయినా.. సాధారణ ప్రయాణాలు అయినా చాలా మంది ట్రైన్ జర్నీకే ఓటేస్తారు.
Video Advertisement
ఇక రైలు ప్రయాణం ఎంత సంతోషంగా ఉంటుందో రైల్వేలో తెలుసుకోవాల్సిన విషయాలు కూడా అన్నే ఉంటాయి. రైలు లోపల ఉండే చైన్ నుంచి రైలు బోగీలపై రాసి ఉన్న అక్షరాల వరకు వాటిలో ఎంతో అర్థం దాగి ఉంటుంది. ఇండియన్ రైల్వేస్‌ను దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్ను అని చెప్పొచ్చు. నిత్యం లక్షల మంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు. రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలను పెద్దగా గుర్తించము.
రైల్వే ట్రాక్‌లపై, క్రాసింగ్‌ల వద్ద కొన్ని బోర్డులను ఏర్పాటు చేస్తుంది భారతీయ రైల్వే.. అలా ట్రైన్ ట్రాక్స్ పక్కన ఏర్పాటు చేసిన సిగ్నల్స్ ఆధారం గా లోకో పైలట్ ట్రైన్ ని ఆపరేట్ చేస్తారు. ఇప్పుడు రైల్వే ట్రాక్ పక్కన కనిపించే ‘H’ గుర్తు గురించి తెలుసుకుందాం..
ఈ గుర్తు ప్రత్యేకంగా లోకో-పైలట్లకు మాత్రమే. దీన్ని హాల్ట్‌ని సూచించడానికి ఉపయోగిస్తుంటారు. ఇది సాధారణంగా లోకల్ ప్యాసింజర్ రైళ్ల ఆపరేషన్ ప్రక్రియలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ప్యాసింజర్ రైలును గమ్యస్థానం వైపు తీసుకెళ్తున్న లోకో-పైలట్లు ‘H’ గుర్తును చూసి కాస్త దూరంలో ట్రైన్ ఆగే స్టేషన్ వస్తుందని అర్థం చేసుకుంటారు.
లోకో పైలట్లు ఈ గుర్తును చూసిన తర్వాత రైలు వేగాన్ని నెమ్మదిగా తగ్గిస్తారు. హాల్ట్ అంటే ఆగిపోవడం. ఈ హాల్ట్ స్టేషన్లు ఏదైనా గ్రామం, పట్టణంలోని స్టేషన్లలో సిద్ధం చేస్తారు. ఈ హాల్ట్ స్టేషన్లలో అన్ని రైళ్లు ఆగవు. ఎంపిక చేసిన కొన్ని రైళ్లు మాత్రమే ఈ స్టేషన్లలో కొంత ఆలస్యంగా ఆగుతాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ హాల్ట్ స్టేషన్లలో ఆగేందుకు అనుమతినిస్తారు.
Also read: ట్రైన్ “ట్రాక్” మారబోతుంది అని డ్రైవర్‌కి ఎలా తెలుస్తుంది.? అదే సమయానికి ఎలా స్లో చేస్తారు..?
End of Article