Ads
చిన్నా.. పెద్దా.. వయసు తేడా లేకుండా.. ఆడ, మగా జెండర్ తేడా లేకుండా అందరు కూల్ డ్రింక్స్ ని ఇష్టపడతారు. ఏదైనా పార్టీ ఉందంటే చాలు కూల్ డ్రింక్స్ తప్పనిసరి. కేక్ కట్ చేసినా.. స్నాక్స్ ఎన్ని ఉన్నా ఓ కూల్ డ్రింక్ బాటిల్ కి మాత్రం తప్పకుండా ప్లేస్ ఇస్తాం.
Video Advertisement
ఇక లంచ్ పార్టీల సంగతి చెప్పక్కర్లేదు. ఏ థమ్స్ అప్ బాటిలో లేకుండా లంచ్ ఫినిష్ అవ్వదు. మనం ఇన్ని సార్లు ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ ని తెచ్చుకుంటాం కదా. వీటిల్లో మీరెప్పుడైనా ఓ విషయం గమనించారా..?
కూల్ డ్రింక్ బాటిల్ ఏదైనా సరే.. బాటిల్ లో చివరి వరకు డ్రింక్ ని ఫిల్ చేయరు. నిండా ఇవ్వకుండా.. కొంచం వరకు స్పేస్ వదిలేస్తారు. ఏ కంపెనీ కూల్ డ్రింక్ అయినా డ్రింక్ మాత్రం నిండా ఉండదు. ఇలా కొంచం స్పేస్ ను వదిలేసి ఎందుకు ఇస్తారు..? ఇది బిజినెస్ ట్రిక్ అని అనుకుంటే అది మన పొరపాటే. ఇంతకీ ఈ స్పేస్ ఇలా ఎందుకు వదిలేస్తారు అన్న విషయం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
సాధారణంగా ఈ కూల్ డ్రింక్స్ లో గ్యాస్ ఉంటుంది. అందుకే ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఇవి పొంగుతాయి. ఈ కూల్ డ్రింక్స్ ను ఎక్కడో తయారు చేస్తారు. అక్కడ నుంచి లోకల్ షాప్స్ కి షిఫ్ట్ చేస్తారు. ఈ క్రమంలో అనేక చోట్ల రకరకాల టెంపరేచర్ ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ లో ఈ బాటిల్స్ ఒత్తిడికి గురవుతాయి. ఈ క్రమంలో ఆ స్పేస్ లేకపోతే గ్యాస్ పొంగడానికి స్పేస్ లేక బాటిల్స్ పేలడానికి అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండడం కోసమే ఈ స్పేస్ ని వదిలేస్తారు.
End of Article