రహదారులపై టూవీలర్లకు ఎందుకు టోల్ ఛార్జ్ వసూలు చేయరు..? అసలు కారణం ఇదే..!

రహదారులపై టూవీలర్లకు ఎందుకు టోల్ ఛార్జ్ వసూలు చేయరు..? అసలు కారణం ఇదే..!

by Anudeep

రోడ్డు పై మనం మన వాహనాలను నడుపుతున్నందుకు గాను టాక్స్ ను చెల్లిస్తూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నిర్మించ బడి, నడపబడుతున్న జాతీయ రహదారులపై తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం పరిధి లో నడపబడుతున్న రహదారులపై మనం టోల్ చెల్లించాల్సి ఉంటుంది.

Video Advertisement

మోటార్ వాహనాల చట్టాల ప్రకారం మనం రోడ్ టాక్స్ ను కట్టినప్పటికీ.. టోల్ ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎక్కువగా కార్, బస్సు, ట్రక్, లారీ వంటి ఫోర్ వీలర్స్ మాత్రమే ఈ టోల్ ని చెల్లించాలి.

toll 1

బైక్, స్కూటీ వంటి టూ వీలర్లు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇలా ఎందుకో తెలుసా..? టోల్ చార్జీల నుంచి టూవీలర్లకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో తెలుసుకుందాం. ఇతర ఫోర్ వీలర్ వాహనాలతో పోలిస్తే టూవీలర్లు చాలా బరువు తక్కువగా ఉంటాయి. టూవీలర్లు రోడ్డుపై ప్రయాణిస్తే రోడ్డుకు అయ్యే డ్యామేజీ ఏమి ఉండదు.

toll 3

అందుకే టూవీలర్ల నుంచి టోల్ ని వసూలు చేయరు. అదే కార్, బస్సు, ట్రక్, లారీ వంటి వాహనాలు చాలా బరువుగా ఉంటాయి.. ఇవి రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డుపై ఒత్తిడి కారణంగా డ్యామేజీ జరిగే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా.. మరో కారణం కూడా ఉంది. అదేంటంటే.. ఈ వాహనాలు ఒక రోజులో ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. కానీ, టూవీలర్లపై ఎవరూ రోజు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయరు.

toll 2

ఎప్పుడో ఒకసారి లాంగ్ డ్రైవ్స్ కి వెళ్లడం లాంటివి తప్ప.. ప్రతి రోజు టూవీలర్లపై వందల కిలోమీటర్ల ప్రయాణం చేయడం అనేది ఉండదు. ఎక్కువగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన వారే టూవీలర్లను ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే వీరి నుంచి టోల్ ను వసూలు చేయరు.


You may also like