Ads
సాధారణంగా మనం చప్పట్లు ఎలా కొడతాం.. రెండు చేతులను దగ్గరగా పెట్టి కొట్టినప్పుడు మన చేతి వేళ్ళు అన్ని దగ్గరగానే ఉంటాయి. కానీ హిజ్రాలు కొట్టే చప్పట్లకి, సాధారణంగా కొట్టే చప్పట్లకి కొంత తేడా ఉంటుంది అని మీరెప్పుడైనా గమనించారా..? వారు చప్పట్లు కొట్టేటప్పుడు వారి చేతి వేళ్ళు దూరంగా ఉంటాయి.
Video Advertisement
అయితే.. ఈ రెండు రకాల చప్పట్లకి బేధం ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా అనుమానం వచ్చిందా..? హిజ్రాలు కొట్టే చెప్పట్లకి ప్రత్యేక అర్ధం ఉంది. అదేంటో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
సాధారణంగా పెళ్లిళ్లు , పుట్టినరోజు వంటి వేడుకల్లో హిజ్రాలు చెప్పట్లు కొడుతూ వచ్చి ఆశీర్వదిస్తారు. అలాగే పలు రైల్వే స్టేషన్స్, నడి రోడ్లపై కూడా వారు ఇదే విధంగా చెప్పట్లు కొడుతూ డబ్బు అడుగుతుంటారు. హిజ్రాలు తమ ఆనందాన్ని అయినా, దుఃఖాన్ని అయినా చెప్పట్లు కొడుతూనే వ్యక్తపరుస్తారు.
అలాగే.. ఓ హిజ్రా మరో హిజ్రాను ఈ విధంగా చెప్పట్లు కొట్టడం ద్వారానే గుర్తిస్తారు. వారికి కోపం వచ్చినా.. సంతోషంగా మాట్లాడుకుంటున్నా కూడా చెప్పట్లు కొడుతూనే మాట్లాడుకుంటారు. వీరు రెండు చేతుల్ని నిలువుగా లేదా అడ్డంగా ఉంచి.. చేతి వేళ్ళని దూరంగా ఉంచి ప్రత్యేక పద్ధతిలో చెప్పట్లు కొడుతుంటారు. ఇలా చెప్పట్లు కొట్టడం వల్ల వచ్చే ప్రత్యేకమైన ధ్వని ఎక్కువ శబ్దాన్ని కలిగి ఉంటుంది.
ఈ విషయమై సమాజ్‌వాదీ పార్టీ నేత విషంభర్ ప్రసాద్ ఓ ప్రకటన కూడా చేసారు. అయితే ఈ ప్రకటన అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. ఆయన హిజ్రాలు చెప్పట్లు కొట్టే విధానం గురించి చెప్తూ.. ఇది వారికి ఆక్యుప్రెషర్ థెరపీలాంటిదని, అందుకే వారు ఎప్పుడూ జబ్బు పడరని.. దీనిని అందరు అనుసరించాలని అన్నారు. దీనితో ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి.
End of Article