మునగ చెట్లను ఇంటి దగ్గర పెంచకూడదని ఎందుకు చెబుతారు..? దీని వెనుక ఇంత కారణం ఉందా..?

మునగ చెట్లను ఇంటి దగ్గర పెంచకూడదని ఎందుకు చెబుతారు..? దీని వెనుక ఇంత కారణం ఉందా..?

by Anudeep

Ads

మునగ కాయలు అందరికి తెలిసిన ఆహారమే. చారు, లేదా కూర చేసుకోవడానికి వినియోగించే ఈ కూరగాయ చెట్టు ఆకులు కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి. మునగ ఆకుతో చేసే పప్పు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు అంటే సిటీస్ వచ్చి ఎక్కువగా చెట్లను పెంచడం లేదు. కానీ, ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక కాయగూర చెట్టు ఉండడం సాధారణమే.

Video Advertisement

అయితే.. మునగ చెట్టుని మాత్రం ఎవ్వరూ పెంచేవారు కాదు. పెద్దలు కూడా మునగ చెట్లను పెంచవద్దని సలహాలు ఇచ్చేవారు. దీని వెనుక బలమైన కారణమే ఉందండోయ్. అదేంటో ఇప్పుడు చూసేద్దాం.

moringa 1

మునగ చెట్టు కొమ్మలూ, కాయలు బాగా తీయగా ఉంటాయి. ఇవి ఇలా తీయగా ఉండడం వలన పురుగులను, ఇతర క్రిమి కీటకాదులను ఆకర్షిస్తాయి. వీటికి తీయగా ఉండే ఆహార పదార్ధాలు ఇష్టం కాబట్టే మునగ చెట్టు ఎక్కితే వదలవు. అయితే.. ఇంటి చుట్టూ పక్కల మునగ చెట్టు ఉండడం వల్ల ఈ పురుగులు కూడా ఇంటి పరిసరాల్లోనే సంచరిస్తూ ఉంటాయి. అంతేకాదు.. గొంగళి పురుగులు లాంటివి అయితే పొరపాటున జారి వంటిపై పడితే నరకం కనిపిస్తుంది.

moringa 2

వాటి ఉమ్మి తీగలా ఉండి జారుతూ ఉంటుంది. ఇది కంటిపైనా లేదా చర్మంపైన పడితే ఒకరకమైన అలర్జీ వచ్చి నరకం చూడాల్సి వస్తుంది. కంట్లో పడితే మాత్రం కళ్ళు పుసికట్టి మూసుకుపోతూ ఉంటాయి. తిరిగి మాములు అవ్వడానికి రెండు మూడు రోజుల నుంచి.. వారం రోజులైనా పడుతుంది. ఇక మునగ కొమ్మలు బలహీనంగా ఉండి గట్టిగా గాలివాటం వస్తే పడిపోతాయి. ఆ సమయంలో చిన్నపిల్లలు ఆడుతూ ఉంటె.. వారిపై పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే మన పెద్దలు ఇంట్లో మునగచెట్టుని పెంచొద్దని చెప్పేవారు. ఇళ్లకు దూరంగా ఈ మొక్కలని పెంచేవారు.


End of Article

You may also like