Ads
సంప్రదాయాలు అంటే ఎప్పటినుండో ఆచరిస్తూ వస్తున్న కొన్ని విషయాలు.కొన్ని సందర్భాలలో కొంతమంది చేసే విషయాలను ప్రశ్నిస్తే ఇది మా ఆచారం అని చెప్తూ ఉంటారు.అసలు సరిగ్గా ఆలోచిస్తే అసలు ఆ ఆచారం ఎలా పుట్టిందో,ఎందుకు మొదలైందో తెలుస్తుంది.
Video Advertisement
మనకు కనిపించే సంప్రదాయాల వెనకాల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కానీ చాలాసార్లు ఆ ఉపయోగాలు అన్ని ఆనాటి కాలానికి అనుగుణంగా ఉపయోగపడేవి అయ్యి ఉంటాయి.అయితే శుక్రవారం తలస్నానం చెయ్యకూడదు అనే ఆచారం వెనకాల ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా శుక్రవారం రోజు చాలా పనులు చేయకూడదు. బూజులు దులపడం, ఇంట్లో ఉన్న చెత్త చెదారాలను శుభ్రం చేసి ఇంట్లోంచి బయట పడేయడం, మగవారు గడ్డం గీయించుకోవడం, హెయిర్ కట్ చేయించుకోవడం, దేవుని సామగ్రి శుభ్రం చేయడం, వ్రతాలు, పూజలు చేసుకున్నప్పుడు ఆ పీఠాన్ని కదపడం, ఆడపిల్లలలను పుట్టింటి నుంచి అత్తింటికి పంపించడం వంటివి చేయకూడదు. ఇక చాలా మంది శుక్రవారం రోజు ప్రత్యేకంగా తల స్నానం చేసి అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు..
అయితే.. శుక్రవారం రోజున తలస్నానం చెయ్యకూడదట. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆరోజున తలకు ఉన్న జిడ్డుని వదిలించేలా తలస్నానం చేస్తే.. ఆమె మనలని వీడి వెళ్ళిపోతుందని విశ్వసిస్తారు. తలని నూనెను పట్టించి.. అది పోయేలాగా తలస్నానం చేస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది. జీవితంలో వృద్ధిని పెంచుకునేలా ఉండాలి కానీ.. పోగొట్టుకునేలా ఉండకూడదు అన్న ఉద్దేశ్యంతోనే శుక్రవారం తలస్నానం చేయకూడదు అన్న నియమాన్ని పెట్టారు.
ఒక వారంలో ప్రతి రోజుకు ఒక్కో అధిపతి ఉంటారు. అలానే.. శుక్రవారం రోజుకు శుక్రుడు అధిపతిగా ఉన్నారు. ఆయనకు ఇష్టమైన పనులను ఆరోజు చేస్తే మనపై అనుగ్రహం కురిపిస్తూ ఉంటారు. ఆరోజున పూజించడం, ఏమైనా వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వంటివి చేయాలి. మన జీవితం అభివృద్ధి వైపు నడిచే పనులను ఆరోజు చేయడం మంచిది. శుక్రవారం రోజున ఏదైనా చేస్తే అది రిపీటెడ్ గా జరుగుతాయని అంటారు… ఏదైనా పడేసినా, వదిలేసినా.. తిరిగి దొరకదని.. ఏదైనా ఇంటికే తెచ్చుకుంటే వృద్ధి జరుగుతుందని చెబుతుంటారు.
End of Article