223
Ads
మనందరం ఆది దేవుని గా శివుడిని పూజిస్తూ ఉంటాం. అయితే, దేశం ఏ శివాలయానికి వెళ్లినా.. ఆయన లింగం ఎదురు గా నందీశ్వరుడు ఉంటారు. దర్శనానికి వచ్చిన భక్తులు కూడా ముందు గా నందీశ్వరునికి నమస్కరించి.. ఆయన కొమ్ముల నుంచే శివ లింగ దర్శనం చేయాల్సి ఉంటుంది. ఐతే.. ఇలా ఎందుకు చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
నందీశ్వరుడు మహాశివుని పరమ భక్తుడు. అందుకే ఆయనను పరమేశ్వరుడు తన వాహనం గా చేసుకున్నాడు. పరమశివుడు, నందీశ్వరుడు మధ్య నుంచి ఎవరు నేరుగా వెళ్ళకూడదు. పరమేశ్వరుడు త్రినేత్రుడు.. ఆయన మూడవ కంటిని తెరిస్తే ఆ కాంతిని మనం భరించలేము. అందుకే, ఆయనను ఎల్లప్పుడూ నందీశ్వరుని కొమ్ముల వైపు నుంచే దర్శించాలి.
End of Article