సర్జరీ అయిన తరువాత వంకాయ తినొద్దని ఎందుకు చెబుతారు..? అసలు కారణం ఇదే..!

సర్జరీ అయిన తరువాత వంకాయ తినొద్దని ఎందుకు చెబుతారు..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

మనం ఆరోగ్యంగా ఉండాలని పదే పదే కోరుకుంటూ ఉంటాం. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే చెక్ చేయించుకుని అవసరమైన మందులు వాడుతూ ఉంటాం. ఒక్కోసారి సమస్య పెద్దదైనప్పుడో.. లేక, యాక్సిడెంట్స్ వంటివాటిని ఎదురుకోవాల్సి వచ్చినప్పుడో ఒక్కోసారి మనకి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది.

Video Advertisement

అయితే మీరెప్పుడైనా గమనించారా..? ఇలా సర్జరీ చేయించుకోవాల్సినపుడు సర్జరీ చేసే రోజు ఉదయం నుంచి ఎటువంటి ఆహారాన్ని తీసుకోనివ్వరు. ఆహారమే కాదు.. కనీసం పచ్చి మంచినీళ్ళని అయినా ముట్టనివ్వరు. అంతే కాదు, సర్జరీ అయిన తరువాత కూడా కొన్ని జాగ్రత్తలని పాటించాలని చెబుతారు.

సర్జరీ చేయించుకున్న తరువాత కచ్చితంగా వంకాయను తినొద్దని చెబుతారు. అయితే.. ఇలా ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏ వైద్యుడు అయినా సర్జరీ చేసేముందు లోకల్ అనస్తీషియా ను పేషెంట్ కు ఇస్తారు. దీనివల్ల మత్తు కలిగి పేషెంట్ నిద్రపోతాడు. ఆ సమయంలో సర్జరీ చేయడం వలన ఎలాంటి నొప్పి తెలియకుండా ఉంటుంది.

brinjal 1

అయితే.. ఇలా లోకల్ అనస్తీషియాను ఇవ్వడం వలన శరీరంలో జీవక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. శరీరం ట్రామాలో పడిపోతుంది. దీనివలన అన్ని అవయవాలు స్తబ్దుగా అయిపోతాయి. తిరిగి వెంటనే పని చేయడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో శరీరంలో హిస్టమిన్ లు విడుదల అవుతూ ఉంటాయి. వాటిని తగ్గించడం కోసమే ఆంటీ హిస్టమిన్ మందులను ఇస్తారు. అయితే వంకాయ హిస్టమిన్ ను విడుదల చేసే పదార్ధం. యాంటీ హిస్టమిన్ మందులు వేసుకుంటూ.. వంకాయ తినడం వలన మందులు పని చేయవు.

brinjal 2

అసలే శరీరం ట్రామాలో ఉండి హిస్టమిన్ లు విడుదల అవుతున్న పరిస్థితిలో మళ్ళీ హిస్టమిన్ లను విడుదల చేసే పదార్ధాలను తినడం వలన దురదలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతే కాకుండా గాయాలు కూడా మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అందుకే వైద్యులు వద్దని చెబుతూ ఉంటారు.

 


End of Article

You may also like