Ads
పెళ్లి అనే ఒక్క బంధం ఎన్నో అద్భుతాలను చేస్తుంది. అందుకే చాలా మంది తమ జీవితం లో పెళ్లి చేసుకునేముందు ఆ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటారు. తమ జీవితాన్ని పంచుకోబోయే భాగస్వామి గురించి ఏవేవో ఊహించుకుంటారు. తమ జీవితం లోకి రాబోయే వ్యక్తి ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని అంచనాలకు వచ్చి.. మొత్తానికి ఓ వ్యక్తి ప్రేమ లో పడిపోతారు.
Video Advertisement
నిశ్చితార్ధం, పెళ్లి వరుసగా జరిగిపోతుంటాయి. అప్పటి వరకు వారిద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఒకవిధమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. పెళ్లి అయిన కొత్తల్లో కూడా కొంతకాలం పాటు ఈ ఎగ్జైట్మెంట్ కొనసాగుతూ ఉంటుంది. ఒక ఆరునెలల నుంచి ఏడాది కాలం గడిచేసరికి వారు తిరిగి వాస్తవ జీవితం లో ఉండే సమస్యల్ని పరిష్కరించుకునే పనిలో పడతారు. సహజం గానే వారి మధ్య ఉండే ఎగ్జైట్మెంట్ లోపిస్తుంది.
వారిద్దరికీ కావలసినంత ఏకాంతం దొరికినప్పటికీ ఒకరిపట్ల మరొకరికి ఆసక్తి మాత్రం ఉండదు. ముఖ్యం రొమాన్స్ విషయం లో పెళ్ళికి ముందు ఉన్న ఉత్సాహం పెళ్ళయాక ఉండదు. రోజు వారి పనుల్లో బిజీ అయిపోతూ ఉండడం.. భాగస్వామి తమని విడిచి ఎక్కడకి వెళ్తారులే అన్న ఆలోచనలు ఉండడం వల్ల కూడా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం తగ్గి దూరం పెరుగుతూ ఉంటుంది. చాలా మంది జంటలు రొటీన్ కి అలవాటు పడడం వల్లే రొమాన్స్ కు కూడా దూరం అవుతుంటారనేది నిపుణుల మాట.
కొందరేమో ఇంట్లో పిల్లలు, పెద్దలు ఉండడం వల్ల దూరం గా ఉంటారట. మరికొందరు రొమాన్స్ వల్ల బాడీ లో జరిగే మార్పులు దృష్టిలో ఉంచుకుని ఫిట్ నెస్ ను కాపాడుకోవాలనే ఉద్దేశ్యం లో ఎక్కువగా జిమ్ కి వెళ్తూ ఉంటారు. ఈ క్రమం లోనే వీరు రొమాన్స్ కి కూడా దూరం అవ్వాలని అనుకుంటారట. ఇక దంపతులు తమ మధ్య దూరం పోగొట్టుకోవాలంటే.. ఎంత బిజీ లైఫ్ లో అయినా అప్పుడప్పుడు ఏకాంత సమయాన్ని కుదుర్చుకోవాలి. ఇద్దరు ఏకాంతం గా కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోవాలి. తద్వారా దూరం తగ్గించుకోవచ్చు.
End of Article