జపాన్ లో భార్యాభర్తలు సెపరేట్ గా ఎందుకు పడుకుంటారు..? అసలు కారణం ఇదే..!

జపాన్ లో భార్యాభర్తలు సెపరేట్ గా ఎందుకు పడుకుంటారు..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

ఏ దేశం లో అయినా భార్యా భర్తలు కలిసే పడుకుంటారు. పెళ్లి అయిన తరువాత దంపతులు ఇద్దరు కలిసే పడుకుంటారు. అందుకోసం ప్రతి ఇంట్లో ప్రత్యేకం గా గదిని ఏర్పాటు చేసుకుంటారు. కానీ, జపాన్ లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటారు. భార్యా భర్తలు కలిసి పడుకోవడానికి ఇష్టపడరు.

Video Advertisement

japan family 1వారు తీసుకున్న ఇల్లు చిన్నదే అయినా.. వారిద్దరూ సెపరేట్ గా పడుకోవడానికి ప్రాముఖ్యత చూపిస్తారు. అయితే.. ఇలా ఎందుకు చేస్తారు? అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్ లో చాలా కుటుంబాలలో భార్య, భర్త ఇద్దరు ఉద్యోగాలలో బిజీ గా ఉంటారు. వారి వర్క్ షెడ్యూల్స్ కూడా వేరుగా ఉంటాయి. ఈ కారణం వల్ల వారిద్దరూ పడుకోవడానికి ఒకే సమయం దొరకదు. ఇద్దరూ సెపరేట్ గా వేర్వేరు సమయాల్లో పడుకుంటూ ఉంటారు.

japan family 2ఇలాంటి పరిస్థితి లో కలిసి పడుకోవాలంటే.. అది వారి వర్క్ షెడ్యూల్ ను దెబ్బతీస్తుంది. అంతే కాదు, వారికి పిల్లలు పుడితే..వారు కచ్చితం గా తల్లితోనే పడుకోవాలన్న నియమం ఉంది. దీనితో మరొకరికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వారు సెపరేట్ గా పడుకుంటారు. పిల్లలు తల్లి దగ్గరే పడుకోవడం వల్ల వారికి మరింత ప్రశాంతమైన నిద్ర పడుతుందట. అందుకే జపాన్ వాసులు దీనిని కచ్చితం గా పాటిస్తారు. ఇతర దేశాలతో పోలిస్తే జపనీస్ తమ నిద్ర కు ఎక్కువ విలువ ఇస్తారు.

japan family 3వారి దృష్టిలో సెపరేట్ గా నిద్రపోవడం అనేది విడాకుల దిశ వైపు వెళ్లడం కాదు. ఇద్దరు ప్రశాంతమైన నిద్రను పొందడం. తద్వారా ఒకరి వర్క్ ను మరొకరు డిస్టర్బ్ చేసుకోకుండా ఉండడం. నిద్రలో గురక పెట్టడం, తన్నడం, కదలడం వంటి అలవాట్లు పక్కన వారికి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటాయి. కానీ, జపనీయులు అవేమి ఉండకూడదనే ఇలా సెపరేట్ గా పడుకుంటారు.


End of Article

You may also like