Ads
ఎంత హ్యాపీ గా సాగిపోతున్న లైఫ్ లో అయినా పరిష్కారం లేని సమస్య ఏదైనా ఉంది అంటే.. అది దోమలు. వీటిని వదిలించుకోవడం అంత సాధ్యం కాదు. తలుపులన్నీ వేసే ఉన్నా, దోమల తెరలు వాడినా, బ్యాట్ లు వాడినా, ఏమి చేసినా ఏదో ఒక టైం లో ఈ దోమల బారిన పడక తప్పదు.
Video Advertisement
అందులోను మరీ చికాకు కలిగించే విషయం ఏమిటంటే ఈ దోమలు ఎక్కువగా మన తల చుట్టూనే తిరుగుతూనే ఉంటాయి. అయితే ఇలా తల చుట్టూనే ఎందుకు తిరుగుతాయో తెలుసా..?
దోమలు మాత్రమే కాదు.. కొన్ని కొన్ని సార్లు మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి ఈగలు వంటి చిన్న చిన్న కీటకాలు తల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే.. వీటన్నికంటే మనకి ఎక్కువగా దోమలే తల చుట్టూ తిరుగుతూ కనిపిస్తాయి. అసలు ఈ దోమలకు అంత ఇంటరెస్ట్ ఎందుకు ఉంటుందో అని మీకెప్పుడైనా అనిపించిందా?
నిజానికి మనం శ్వాస ద్వారా విడుదల చేసే కార్బన్ డై ఆక్సయిడ్, తలలో నూనె రాయడం వల్ల వచ్చే వాసన కు దోమలు ఆకర్షితం అవుతాయి. నూనె రాసాక తలకు ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది. ఈ చెమటకి కూడా దోమలు ఆకర్షితం అవుతాయి. ఈ వాసనే దోమల్ని మన తల చుట్టూ తిరిగేలా చేస్తుంది. మానవుల చెమటలో ఉండే ఆక్టెనాల్ అనే రసాయనాన్ని దోమలు ఎక్కువగా ఇష్టపడతాయి. అందుకే తల నుంచి స్వేదం వస్తున్నపుడు ఆ వాసనను దోమలు గుర్తించి తల చుట్టూ ముసురుకుంటాయి.
End of Article