విడాకులు తీసుకున్నాక అమ్మాయిలు భరణం వద్దని ఎందుకు అంటున్నారు..? దానికి 5 కారణాలు ఇవే..!

విడాకులు తీసుకున్నాక అమ్మాయిలు భరణం వద్దని ఎందుకు అంటున్నారు..? దానికి 5 కారణాలు ఇవే..!

by Anudeep

Ads

ఇటీవలి కాలం లో విడాకులు ఎక్కువ అవుతున్నాయి. ఆర్ధిక స్వేచ్ఛ, మితిమీరిన టెక్నాలజీ వాడకం, చిన్న గొడవలకు విడిపోవాలన్న ఆలోచనలు వస్తుండడం, ఇలా కారణం ఏదైతేనేమి.. విడాకుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంటోంది. అయితే.. విడాకులు తీసుకున్నాక భర్త.. ఎంతో కొంత మొత్తాన్ని భార్యకు భరణంగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటివరకు బాగోగులు చూసుకున్న భర్త లేకపోతే.. ఆ మహిళ రోజులు గడవడానికి ఇబ్బందిపడాలి కాబట్టి భరణం అన్న దానిని తీసుకొచ్చారు.

Video Advertisement

divorce 1

కానీ, ఈరోజుల్లో మాత్రం మహిళలు భరణాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఇటీవల సమంత, నాగ చైతన్యలు కూడా విడాకులు తీసుకున్నారు. భరణంగా నాగచైతన్య ఇవ్వాల్సిన 200 ల కోట్ల రూపాయలను సమంత తిరస్కరించింది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే, ఇది అధికారికం కాదు. గతంలోకి చూసుకున్నా, మెకంజీ కూడా భరణం కింద వచ్చే రెండున్నర లక్షల కోట్ల రూపాయలను తిరస్కరించింది.

divorce 2

కేవలం సెలెబ్రిటీలే కాదు, సాధారణ మహిళల్లో కూడా భరణాన్ని తిరస్కరించే మహిళలు ఎక్కువ అవుతున్నారు అని నిపుణులు చెబుతున్నారు. దీనికి ఐదు కారణాలున్నాయి. అవేంటో చూద్దాం.

#1. ఈకాలం లో అమ్మాయిలు స్వతంత్రంగా బతుకుతున్నారు. విద్యారంగం లో రాణించి, తమ చదువుకు తగ్గ కొలువును ఎంచుకుని ఆర్ధిక స్వేచ్ఛ తో జీవిస్తున్నారు. వీరు భర్త నుంచి భరణం పై ఆధారపడడానికి ఇష్టంలేక తిరస్కరిస్తున్నారు.

#2. విడిపోయేదాకా వచ్చారంటే.. భార్యాభర్తల మధ్య గొడవలు ఓ రేంజ్ లో జరిగివుంటాయి. భర్త లక్షణాలపైన ఇష్టం లేకపోవడం, భర్త ప్రవర్తనపైనా విసుగు చెంది ఉంటారు. తిరిగి అలాంటి భర్త దగ్గర డబ్బును తీసుకోవడానికి చాలామంది ఇష్టపడడంలేదు. భర్త సంపాదించే అక్రమ సంపాదనలు నచ్చనివారు కూడా తిరస్కరిస్తూ ఉండి ఉండవచ్చు.

divorce 3

#3. భర్త మోసం చేసిన వాడైతే.. సహజంగానే ఏ అమ్మాయికి అయినా అతనిపట్ల విరక్తి కలుగుతుంది. అతని డబ్బు పట్ల కూడా అదే రకమైన ఏహ్యభావం ఉంటుంది. కొందరు భర్త నుంచి భరణం కొరకపోవడానికి ఇది కూడా ఒక కారణం.

#4. హిందూ వివాహ చట్టాల ప్రకారం విడాకులు ఇచ్చిన భార్య మళ్ళీ పెళ్లి చేసుకుంటే.. ఆమెకు మాజీ భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది దృష్టి లో ఉంచుకునే చాలామంది భరణం అవసరంలేదని ముందే చెప్పేస్తున్నారు.

divorce 4

#5. కొందరు భార్యలకు ఇష్టం లేకున్నా విడాకులు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో భర్తపై పెంచుకున్న కోపంతో కూడా తమకు భరణం అవసరం లేదని చెబుతున్నారట. మహిళలు తమ ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా చూసుకునే క్రమంలోనే ఈ భరణం వద్దని చెబుతున్నారట.

Note: Images used in this content are for reference purposes only.


End of Article

You may also like