ఎక్కువ గా సంపాదించే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా టాక్స్ పే చేస్తారా..? ఆ రూల్స్ ఎలా ఉంటాయి..?

ఎక్కువ గా సంపాదించే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా టాక్స్ పే చేస్తారా..? ఆ రూల్స్ ఎలా ఉంటాయి..?

by Anudeep

Ads

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అయింది. స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు, సోషల్ మీడియా వాడని యువత ఉన్నారంటే అరుదనే చెప్పాలి. ఈ క్రమంలో సోషల్ మీడియా కూడా వ్యాపారం అయిపోతోంది. యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాల ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాపులారిటీ పెంచుకుంటున్నారు. ఆ పాపులారిటీని వారికి ఆదాయాన్ని సమకూర్చుతోంది.

Video Advertisement

social media influencers 1

ఈ మధ్య సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఎక్కువే అవుతున్నారు. ఒకసారి పాపులారిటీ వస్తే ఆదాయానికి ఏమీ కొదవ ఉండదు. బాగా పాపులర్ అయిపోయిన సెలెబ్రిటీలు లక్షల్లో సంపాదించేస్తున్నారు. మరి వీరికి టాక్స్ నిబంధనలు వర్తిస్తాయా..? లేదా? అన్న సందేహం మీకెప్పుడైనా వచ్చిందా..? జనాభా లో దాదాపు 57 శాతం మంది పూర్తిగా సోషల్ మీడియా పైనే ఆధారపడి, రివ్యూలు చూసుకుని ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తున్నారట.

social media influencers 2

ఈ క్రమంలో పలు కంపెనీలు సైతం తమ ప్రోడక్ట్స్ వాణిజ్య ప్రకటనల కోసం సోషల్ మీడియా పైనే ఆధారపడుతున్నాయి. ఈ లెక్కన వీడియో సేల్స్, డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, ప్రోడక్ట్ రిప్రెజెంటేటివ్ లేదా అంబాసిడర్‌ , స్పాన్సర్డ్ సోషల్ అండ్ బ్లాగ్ పోస్ట్‌ లు చేసేవారికి సంవత్సర ఆదాయం కోటికి కూడా చేరే అవకాశం ఉంటుంది. వీరిపై పన్ను విధానం ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

social media influencers 3

ఒక ఆర్ధిక సంవత్సరంలో ఇరవై లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తుంటే.. వారు కచ్చితంగా GST కింద రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ GST కింద రిజిస్టర్ అయిన యూట్యూబర్స్, బ్లాగర్స్, ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్స్ కు 18 శాతం టాక్స్ పడుతుంది. ఇందులో తొమ్మిది శాతం స్టేట్ టాక్స్ కాగా… మరో తొమ్మిది శాతం సెంట్రల్ టాక్స్. కొన్ని రాష్ట్రాల నిబంధనల మేరకు 18 శాతం ఇంటిగ్రేటెడ్ టాక్స్ కూడా పడే అవకాశం ఉంటుంది.

social media influencers 4

చాలా మంది ఇన్ఫ్లుయెన్సుర్స్ లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ ను అందిస్తూ తమ సేవలను కొనసాగిస్తుంటారు. లేదంటే.. IGST చెల్లించి ఆ తరువాత వాపసుగా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. మరికొంత మంది యూట్యూబర్స్ గూగుల్ యాడ్ సెన్స్, గూగుల్ ఇంక్ వంటి ప్లాట్‌ఫార్మ్స్ ను ప్రకటనలకు వినియోగిస్తుంటారు. ఈ ప్లాట్‌ఫార్మ్ లు దేశం పరిధిలోకి రావు కాబట్టి సప్లైను “జీరో రేట్” గా పరిగణిస్తూ ఉంటారు.

social media influencers 5

అలాగే.. ఈ పన్నుల్లో మినహాయింపులు కూడా ఉంటాయి. వ్యాపారానికి అవసరమైన వస్తువుల కొనుగోలు ఖర్చులను కూడా ఆదాయంలో నుంచి తీసివేయవచ్చు. అంటే మైక్రోఫోన్ కొనుగోళ్లు, కెమెరా కొనుగోళ్లు వంటివి కూడా మినహాయింపులు జత చేయవచ్చు. ఇవే కాదు, ఇంటర్నెట్ ఖర్చులు, ఆఫీస్ రెంట్ లు, ఆఫీస్ కి అవసరమైన సామాన్లు, ఇతర కార్యాలయ ఖర్చులను కూడా ఇందులో జత చేయొచ్చు. డిజైన్, ఎడిటింగ్, ప్రమోషన్స్, అడ్వర్టైజింగ్ కి అయ్యే ఖర్చులను కూడా వీటిలో కలుపుకుని పన్ను మినహాయించుకోవచ్చు.


End of Article

You may also like