ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అనారోగ్యంతో మంచం పట్టాడు. కొన్నాళ్లు మరణించాడు. కనిపెంచిన తండ్రి కదలలేని స్థితిలో ఉండిపోయాడు. కడుపున పుట్టిన పిల్లలు ఇంకా లోకం తెలియని వయసు. ఓపిక ఉన్నప్పుడు సంపాదించిన కొద్ది మొత్తం సహా ఉన్న ఇల్లు కొద్దిపాటి ఆస్తులు భర్త అనారోగ్యానికి ఖర్చు అయిపోయాయి.

Video Advertisement

ఉన్నట్టుండి భర్త చనిపోయాడు. తనకంటూ మిగిలింది ఇంకా చిన్న వయసులో ఉన్న పిల్లలు మాత్రమే .అనారోగ్యంతో ఉన్న తండ్రి. ఎలా బతకాలి? వారిని ఎలా పోషించాలి? ఇది ఆమెను వేధించిన ప్రశ్న…?భద్రాచలానికి చెందిన అరుణకు, రాజమండ్రి కి చెందిన శ్రీనుతో చిన్న వయసులోనే ప్రేమ వివాహం జరిగింది. శ్రీను భద్రాచలం కరకట్ట పక్కనే ఉన్న స్మశాన వాటికలో కాటి కాపరి వద్ద పనిచేసేవాడు. అనంతరం తానే కాటికాపరి అయ్యాడు.

తర్వాత కొన్నాళ్ళకి అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటికే అరుణ తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు. ఇక పిల్లల పోషణకు వేరే దిక్కు లేక తన భర్త చేసే వృత్తినే ఎంచుకుంది అరుణ. తానే కాటి కాపరిగా మారింది. కరోనా సమయంలో చనిపోయిన వాళ్లకు అంతిక్రియలు చేయడానికి రక్తసంబంధీకులు సైతం దూరంగా ఉన్న అరుణ మాత్రం తన వృత్తి ధర్మాన్ని వీడలేదు. తనకు తనవారికి కడుపు నింపుతున్న ఈ పని పట్ల తనకు గౌరవం. తాను ఇష్టపడి ఈ పనిని ఎంచుకున్నానని చెబుతుంది. ఇలా ఏ మహిళ సాహసించని రీతిలో ఓ అరుదైన వృత్తిని చేపట్టింది అరుణ.ఈమెను న్యూస్ 18 చానల్ ఇంటర్వ్యూ చేసింది.

aruna

ఐదుగురు అనాధలకు ఆశ్రయం కల్పించి వారిని పెంచుతుంది. వీరిలో యువతికి  వివాహం జరిపించింది. ఇలా చేసే పనిని ప్రేమిస్తూ, తన కుటుంబాన్ని కాకుండా మరో ఐదుగురికి ఆసరాగా నిలిచిన అరుణ నిజమైన విజేత అంటారు భద్రాచలం వాసులు. పంచాయతీ వాళ్ళు తీసుకువచ్చిన అనాధ శవాలను సైతం అరుణ శ్రద్ధగా అంతిక్రియలు నిర్వహించింది. మగవాళ్ళు సైతం ముందుకు రాని ఈ వృత్తిని అరుణ ఎంచుకుని ఎందరి మన్ననలో పొందుతుంది.

Also Read:రష్మిక చూపించి షో చేసేదానికంటే ఆ వీడియోలో తక్కువ ఏం లేదు… కరెక్ట్ గా చెప్పారు అంటూ “మాధవి లత”పై ప్రశంసలు.!