“ఆ విషయాన్ని మా ఇంట్లో చెప్తా..” అంటూ నన్ను బెదిరిస్తున్నాడు.. నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి?

“ఆ విషయాన్ని మా ఇంట్లో చెప్తా..” అంటూ నన్ను బెదిరిస్తున్నాడు.. నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి?

by Anudeep

Ads

మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఒక్కోసారి తెలియకుండానే మోసపోతూ ఉంటాం. మనకి పరిచయం అయిన వ్యక్తులలో అందరు మంచి వాళ్ళ్లే అని అనుకోవడం కూడా మన పొరపాటే ఉంటుంది. ఎందుకంటే కొందరు పైకి ఒకలా.. మనసులో ఒకలా నటిస్తూ ఉంటారు. ఇటువంటి వారు మనకి ఎప్పటికైనా హాని తలపెట్టాలనే యోచనతోనే ఉంటారు.

Video Advertisement

అయితే.. మన చుట్టూ ఉండే వ్యక్తులలో ఎవరు ఎలాంటి వారు అన్న విషయాన్ని మనం అంత తొందరగా గుర్తించలేము. అందుకే.. మనం ఎవరితో మాట్లాడుతున్నా జాగరూకతతోనే వ్యవహరించాల్సి ఉంటుంది.

cheating boy

ఓ అబ్బాయితో సన్నిహితంగా మెలుగుతూ.. అతని మోసపూరిత స్వభావాన్ని పసిగట్టిన ఓ అమ్మాయి తన సమస్య నుంచి ఎలా బయట పడాలో తెలియక ఓ లేఖ రాసింది. తాను ఉన్న పరిస్థితులను చెప్పి తనని తాను ఎలా కాపాడుకోవాలో చెప్పాలని సలహా కోరుతోంది. ఇంతకీ ఏమి జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ అమ్మాయి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఆమె రాసిన లేఖలో ఏముందంటే.. “చదువుకుంటున్న రోజుల్లోనే ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను.. నా సన్నిహితులు అతని మంచి వాడు కాదు.. అతనితో వద్దు.. అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అతను చెప్పిన ప్రతి మాటని గుడ్డిగా నమ్మాను.

cheating boy 1

కొన్ని రోజులు అతనితో ట్రావెల్ చేసాక.. అతని వ్యక్తిత్వం ఎంత నీచమైనదో తెలిసి వచ్చింది. అతను మంచి వాడు కాదని, అతనికి దూరంగా ఉండాలని భావించాను. అయితే.. నేను అతన్ని దూరం పెట్టడాన్ని అతను సహించలేదు. తనతో సన్నిహితంగా ఉండాలని, ప్రేమించాలని బలవంతం చేస్తున్నాడు. లేకుంటే.. మా మధ్య జరిగినవి అన్నీ మా ఇంట్లో వాళ్లతో చెప్తానని బెదిరిస్తున్నాడు. మా తల్లి తండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. నేను ఒక్కదాన్నే కూతురుని కావడంతో నా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

cheating boy 2

నా జీవితంలో ఓ ప్రేమ వ్యవహారం ఉందని తెలిస్తే వారు తట్టుకోలేరు. అందుకే అతనికి భయపడి చనిపోవాలని అనుకున్నాను. రెండు మూడు సార్లు ప్రయత్నించి విఫలం అయ్యాను. ఈ విషయాలన్నీ తెలిసిన ఆ అబ్బాయి నన్ను ఇంకా బెదిరిస్తూనే ఉన్నాడు. నా సమస్యకి పరిష్కారం ఏంటి..? అతన్నుంచి బయటపడాలి అంటే నేను ఏమి చేయాలి..?” అంటూ ఆమె తన బాధని వెళ్లబుచ్చుకుంది. ఆమెకు సరైన సలహా ఇవ్వగలరు.


End of Article

You may also like