Ads
ఇంత ఆధునిక కాలంలో కూడా మన దేశంలో ఆడపిల్లల చదువు, ఉద్యోగం గురించి వస్తే వింతగా చూస్తారు. అలాంటిది కొన్ని వందల ఏళ్లక్రితమే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆడవాళ్లు తమ గుర్తింపుని చాటుకున్నారని తెలుసా..మనకెలా తెలుస్తుంది లెండి బల్బు కనిపెట్టింది ఎవరు అంటే ఎడిసన్ గురించి టక్కున చెప్తాం కాని మేరీ ఆండర్సన్ ఎవరంటే పేరు కూడా విననట్టు బిక్క ముఖాలేస్తాం.. అనాధిగా ఆడవాళ్లకి ఇస్తున్న విలువ ఇక్కడే అర్దమైపోతుంది. మనం రోజూ ఉపయోగించే ప్రతి వస్తువు వెనుక ఉన్నది ఇద్దరు మహిళలే మేరీ ఆండర్సన్ మరియు అన్ త్సుకమొటో..వీరితో పాటు మరి కొంత మంది మహిళా శాస్త్రవేత్తలు, వారు కనిపెట్టిన అధ్బుత ఆవిష్కరణల గురించి చదవండి.
Video Advertisement
జోసెఫీన్ కోష్రెన్
నెస్సెసిటి ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్సన్ అన్నారు. ఇంట్లో పనిమనిషి సెలవు తీస్కోవడంతో , పని మనిషి కంటే స్పీడ్ గా, నీట్ గా డిషెస్ ని క్లీన్ చేసే డిష్ వాషర్ ను తయారు చేశారు జోసెఫీన్. ప్రపంచంలో తొలి ఆటోమేటిక్ డిష్ వాషర్ అదే.ఈ ఆవిష్కరణకు గాను 1886లోనే ఆమె పేటెంట్ హక్కులు పొందారు.ఆ తరువాత డిష్ వాషర్ తయారీ పరిశ్రమను ప్రారంభించారు.
డా. షెర్లీ ఆన్ జాక్సన్
భౌతిక శాస్త్రంలో శాస్త్రవేత్త అయిన డా. షెర్లీ.. టెలికాం రంగంలో అనేక పరిశోధనలు చేశారు.ఫోన్ కాల్ ఎవరి నుంచి వస్తుందో తెలిపే కాలర్ ఐడి, మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మరో కాల్ వస్తే తెలిపే కాల్ వెయిటింగ్ ఫీచర్లను ఈమె అభివృద్ధి చేశారు. ఫైబర్ ఆప్టిక్ కేబుల్, ఫ్యాక్స్ మెషీన్లు, సోలార్ బ్యాటరీల తయారీ వెనక ఈమె పరిశోధనలే కీలకం.అమెరికాలోని ప్రఖ్యాత మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరేట్ అందుకున్న తొలి ఆఫ్రికన్-అమెరికన్ డా షెర్లీ ఆన్ జాక్సన్
మేరీ ఆండర్సన్
మేరీ ఆండర్సన్ న్యూయార్క్‌లో పర్యటిస్తున్న సమయంలో చలికాలం కావడంలో కారు అద్దాలపై మంచు పడుతోంది.ఆ మంచును తుడిచేందుకు డ్రైవర్ మాటిమాటికీ కారును ఆపి, కిందికి దిగుతూ, అద్దాలు తుడిచి కార్ ఎత్తుకున్నాడు. పదే పదే కార్ డోర్స్ ఓపెన్ చేస్తుండడంతో కారులో ఉన్న మేరీ మరియు ఇతరులు చలికి వణికి పోతున్నారు. దాంతో ఈ సమస్యకు ఎలా అయినా పరిష్కారం కనిపెట్టాలని ఆలోచనలో పడింది ఆండర్సన్.. ఆ ఆలోచనలోనుండే రబ్బరుతో గ్లాస్ వైపర్ తయారు చేసింది. ఇది జరిగింది 1903లో, తయారు చేసిన వెంటనే దానిపై పెటెంట్ హక్కులు కూడా పొందింది.
మేరీ వ్యాన్ బ్రిట్టన్ బ్రౌన్
ఇప్పుడు ఎక్కడ చూసినా సిసిటివిలు దర్శనమిస్తున్నాయి.కాని వీటికి పునాది పడింది 1960లోనే,నర్సుగా పనిచేసే మేరీ ఎక్కువగా ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చేది.రోజురోజుకీ నేరాలు పెరిగిపోతుండటంతో ఇంటి గుమ్మాన్ని పర్యవేక్షించేందుకు 1960లో ప్రత్యేక కెమెరాను ఏర్పాటు చేశారు.ఇంటి లోపలే ఉండే ఆ కెమెరా ఇంటి ముందు పరిసరాలను తలుపు రంధ్రంలోంచి చిత్రీకరిస్తూ ఉండేది.ఆ వీడియోను బెడ్ రూంలోని తెరపై చూసే వీలుండేది.
స్టెపనీ కొలెక్
బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు తయారీలో వినియోగించే ఫైబర్‌ను 1965లో సృష్టించారు స్టెఫనీ . స్టీల్ కంటే ఐదు రెట్లు గట్టిగా ఉండే ఆ పదార్థంతో రూపొందించిన జాకెట్లను లక్షల మంది సైనికులు, పోలీసులు వినియోగిస్తున్నారు.ప్రస్తుతం చేతి గ్లౌజులు,మొబైల్ ఫోన్లు,విమానాలు మరియు వేలాడే వంతెనల తయారీలోనూ ఆ ఫైబర్‌ను వాడుతున్నారు.
ఓల్గా డి గాన్జలెజ్ సనాబ్రియో
ప్రస్తుతం నాసా పరిశోధనా కేంద్రంలో ఇంజినీరింగ్ విభాగంలో డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓల్గా 1980లోనే బ్యాటరీల సాంకేతికతను అభివృద్ది చేశారు. అత్యధిక బ్యాకప్ ఇచ్చేవిధంగా నికెల్-హైడ్రోజన్ బ్యాటరీల తయారి చేసారు. ఈ బ్యాటరీలను అంతరిక్ష కేంద్రాల్లో ఉపయోగిస్తుంటారు.
ఆన్ త్సుకమొటే
రక్తకణాలు ఉత్పత్తిలో కీలకమైన స్టెమ్ సెల్స్‌ను వేరు చేసే విధానాన్ని కనుగొన్నారు ఆన్ త్సుకమొటే . వాటిని కనిపెట్టినందుకు గాను 1991లో పేటెంట్ పొందారు.ఈ విధానంతో బ్లడ్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చాలా సులభతరమైంది . ప్రస్తుతం స్టెమ్ సెల్ ఎదుగుదలపై ఆమె పరిశోధనలు చేస్తున్నారు.
End of Article