అప్పటికే మూడు పెళ్లిళ్లు.. ఇంకా మరొకడితో చాటింగ్.. ఈ లేడీ మాములు కిలాడీ కాదు.. అసలు ఎలా దొరికిపోయిందంటే..?

అప్పటికే మూడు పెళ్లిళ్లు.. ఇంకా మరొకడితో చాటింగ్.. ఈ లేడీ మాములు కిలాడీ కాదు.. అసలు ఎలా దొరికిపోయిందంటే..?

by Anudeep

Ads

ఇటీవలి కాలంలో నైతిక విలువలు పూర్తిగా అంతరిస్తున్నాయి. పెళ్లి చేసుకున్న తరువాత జీవిత భాగస్వామితో జీవితంతో పాటు కష్ట సుఖాలను పంచుకోవడం తగ్గిపోయింది. చిన్న చిన్న గొడవలకే విడిపోవటం.. మరొకరిని పెళ్లి చేసుకోవడం సాధారణం అయిపోతోంది. అయితే.. ఇటీవల కొంతమంది ఒకరికి తెలియకుండా మరొకరితో సంబంధాలు నెరుపుతున్నారు.

Video Advertisement

తాజాగా.. మైసూరులో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. మైసూర్ ఉదయగిరికు చెందిన నిధాఖాన్ టిండర్ లో పరిచయమైన వ్యక్తులతో ప్రేమ పేరుతొ దగ్గరై.. ఆ తరువాత పెళ్లి చేసుకుని కొన్నాళ్ళకి విడిపోతోంది.

ఆమె ఇదే విధంగా వరుసగా మూడు పెళ్ళిళ్ళను చేసుకుంది. మూడవ సారి 2019 వ సంవత్సరంలో బెంగళూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేసే ఆజామ్‌ఖాన్‌ ను వివాహం చేసుకుంది. ఆజామ్‌ఖాన్‌ కూడా టిండర్ ద్వారానే పరిచయం అయ్యాడు. అయితే పెళ్లి అయిన కొన్ని రోజులకే నిధాఖాన్ ప్రవర్తనలో మార్పు రావడంతో ఆజామ్‌ఖాన్‌ కు అనుమానం వచ్చింది.

ఆమె గురించి ఎంక్వైరీ చేయగా.. ఇంతకుముందే ఇద్దరిని పెళ్లి చేసుకుని విడిపోయిందని తెలిసిందే. పెళ్లి అయినా కూడా ఆన్ లైన్ లో ఇతర పురుషులతో చాట్ చేస్తోందని గమనించిన ఆజామ్‌ఖాన్‌.. ఆమె మరొకరితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఈ మేరకు మైసూర్ లోని ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


End of Article

You may also like