మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోవడం లేదా రుతుచక్రం ఆగిపోవడం. మెనోపాజ్ అనేది సహజంగా జరిగే ప్రక్రియ. మహిళల హార్మోన్లలో కలిగే మార్పుల్లో ఇది ఒక మైలురాయి. సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారు మెనోపాజ్‌ కు చేరుకుంటారు. కానీ ప్రస్తుతం 40 ఏళ్లకే మెనోపాజ్‌ యొక్క లక్షణాలు మొదలవుతున్నాయి.

Video Advertisement

నెలసరి ఆగిపోయే ముందు మహిళలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించవు. ప్రెగ్నెన్సీలో లాగే ప్రతి మహిళకి డిఫరెంట్ లక్షణాలు కనిపిస్తాయి. అయితే మెనోపాజ్ వచ్చేముందు కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..పీరియడ్స్‌ అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక భాగం. మోనో పాజ్ ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్య. రుతుక్రమం అనేది గతి తప్పుతుంది. అమ్మాయి రజస్వల అయినప్పుడు మొదలైన రుతుక్రమం ఆగిపోతుంది. దీన్ని మెనోపాజ్ అంటారు. అలాగే పన్నెండు నెలల పాటు నెలసరి రావడం నిలిచిపోతే దాన్నే మెనోపాజ్ గా చెబుతారు. ఈ దశ మొదలయ్యే ముందు మహిళలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి కూడా మహిళలందరిలో ఒకేలా ఉండవు.మెనోపాజ్ ముందు మహిళల్లో వచ్చే లక్షణాలు, ఏమిటంటే, చిన్న విషయాలకే ఎక్కువగా కోపం, చిరాకు, ఇరిటేషన్ లాంటివి వస్తుంటాయి. జుట్టు రాలటం, మతిమరుపు, నిద్రపట్టకపోవటం, తలనొప్పి, ఒంట్లో వేడి ఆవిర్లు రావటం. చర్మంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. చర్మం సాగినట్టుగా అవుతుంది. ముడుతలు కూడా వస్తాయి. స్కిన్ కాంతి తగ్గిపోతుంది. బరువు పెరగుతారు. ఇలా ఆఖరికి రుతు చక్రాలు పూర్తిగా ఆగిపోతాయి.ఈ సమయంలో తమకి ఎదురయ్యే సమస్యలను మహిళలు పైకి చెప్పలేరు. ఇక వాటిని భరించలేక తమలో తామే సతమతమవుతూ ఉంటారు. హార్మోన్ల ఉత్పత్తిలో వచ్చే మార్పుల వల్ల మెనోపాజ్ స్టేజ్ లో మహిళలు మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతుంటారు. ఈ సమయంలో బరువు పెరగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రొమ్ము క్యాన్సర్, గుండె జబ్బులు లాంటివి వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. వివరాల కోసం ఈ వీడియో చూడండి.

watch video :

Also Read: మీ శరీరంలో ఈ 3 పార్ట్స్ లో నొప్పి వస్తోందా..? అయితే అది గుండె నొప్పికి సంకేతమే.. జాగ్రత్తపడండి..!