పది రూపాయలు పెట్టి ఇది కొనుక్కుంటే..అమ్మాయిలకి పబ్లిక్ టాయిలెట్స్ లో ఎలాంటి ఇబ్బంది ఉండదు..!

పది రూపాయలు పెట్టి ఇది కొనుక్కుంటే..అమ్మాయిలకి పబ్లిక్ టాయిలెట్స్ లో ఎలాంటి ఇబ్బంది ఉండదు..!

by Anudeep

Ads

మహిళలు ఎదుర్కొంటున్న చాలా సమస్యల్లో పబ్లిక్ టాయిలెట్స్ ఒకటి. ఒక వయసు వచ్చేసాక అమ్మాయిలు అబ్బాయిల్లా ఫ్రీ గా ఉండలేరు. వాష్ రూమ్స్ కి వెళ్ళడానికి కూడా వారికి సరైన టాయిలెట్ ఫెసిలిటీ ఉంటె తప్ప వెళ్ళడానికి సాధ్యపడదు. ఈ మధ్య అన్ని టాయిలెట్స్ లోను అబ్బాయిలకు స్టాండింగ్ టాయిలెట్స్, అలాగే వెస్ట్రన్ మోడల్ లో ఉండే టాయిలెట్స్ ను అమ్మాయిలను ఉద్దేశించి నిర్మిస్తున్నారు.

Video Advertisement

sanfe

ఇక్కడే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ లో కూర్చుని వెళ్ళవలసి ఉంటుంది. దీని వలన టాయిలెట్ సీట్ పై ఉండే అనేక సూక్ష్మ క్రిముల వలన ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కరోనా మహమ్మారి వచ్చాక ఈ ఇబ్బందులు మరింత ఎక్కువ అయ్యాయి. దీనితో, చాలా మంది అమ్మాయిలు ఎక్కువ సార్లు టాయిలెట్ కి వెళ్లకుండా ఉండేందుకు తక్కువ నీరు తాగడం, టాయిలెట్ కి వెళ్లకుండా ఉండడం వంటివి చేస్తున్నారు. దీనివలన మరింత ఎక్కువ గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

women

ఇది దృష్టిలో ఉంచుకున్న ఢిల్లీ కి ఐఐటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఓ పరికరాన్ని రూపొందించారు. వీరు మూడో ఏడాది టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీరి కనిపెట్టిన పరికరం ద్వారా అమ్మాయిలు కూడా టాయిలెట్ కి నుంచుని వెళ్ళచ్చు. ప్రొఫెసర్ల సాయం తో వారు దీనిని రూపొందించి తమ తరగతి లోని అమ్మాయిలకు ఇచ్చారు. వాడినతరువాత ఫీడ్ బ్యాక్ ఇవ్వమని కోరగా.. ఆ అమ్మాయిలు సంతృప్తి వ్యక్తం చేశారట. దీనికి సన్ఫె అని నామకరణం చేసారు. దీని వెల పది రూపాయలు మాత్రమే.

sanfe 3

దీనిని డిజైన్ చేయడానికి వారికి ఆరునెలలకు పైనే కాలం పట్టింది. ప్రస్తుతం ఇది బాగా హిట్ అవడం తో వారికి ఆర్డర్లు బాగానే వస్తున్నాయట. ప్రస్తుతం ఈ పరికరాలు మార్కెట్ లలో కూడా దొరుకుతున్నాయి. ఢిల్లీ ఎయిమ్స్ లోను, చుట్టుపక్కల ఫార్మసిల్లోనూ లభ్యం అవుతోంది. తొందర లోనే ఇవి దేశ వ్యాప్తం గా అందుబాటులోకి రానున్నాయి. ఈ కుర్రాళ్ళు ఆ పనుల్లోనే నిమగ్నం అయి ఉన్నారు.


End of Article

You may also like