“సుహాస్” హీరోగా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ ఓటీటీ లోకి వచ్చేది ఎప్పుడంటే..??

“సుహాస్” హీరోగా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ ఓటీటీ లోకి వచ్చేది ఎప్పుడంటే..??

by Anudeep

Ads

ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలుస్తున్న చిత్రాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం రైటర్ పద్మభూషణ్ ఒకటి. మజిలీ, ప్రతి రోజు పండగే వంటి చిత్రాలతో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్. ఆ తర్వాత కలర్ ఫోటో చిత్రం తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఓటీటీ లో విడుదల అయిన ఈ చిత్రం తో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు సుహాస్.

Video Advertisement

 

 

ఇక ఇటీవలే తన రెండో చిత్రం రైటర్ పద్మభూషణ్‌తో సందడి చేశాడు సుహాస్. ఫిబ్రవరి 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సుహాస్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఫిబ్రవరిలో విడుదలైన చిత్రాల్లో ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీల్లో విడుదలవుతుందా ప్రేక్షకులు ఆత్రుతగా చూస్తున్నారు.

writer padmabhushan movie OTT release date fix..!!
రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పైగా కలెక్షన్స్ కూడా ఊహించని లాభాలను నిర్మాతలకు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో సుహాస్ సరసన టీనా శిల్పరాజ్ హీరోయిన్‌గా చేసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రానికి షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆశిశ్ విద్యార్థి, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందింది.

writer padmabhushan movie OTT release date fix..!!

అయితే తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుదలకు సంబంధించిన అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుందని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22 నుంచి ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.


End of Article

You may also like