ఇటీవల సమంత హీరోయిన్ గా నటించిన యశోద చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. హరి- హరీష్ ద్వయం తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ దేవి మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

Video Advertisement

 

తొలి రోజే పాజిటివ్ టాక్‌‌ని సొంతం చేసుకుని రూ.30 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి హిట్‌గా నిలిచింది. సమంత ‘మయోసైటిస్‌’ అనే దీర్ఘకాలిక వ్యాధికి చికిత్స తీసుకుంటూనే ఈ సినిమాలో స్టన్స్ కూడా చేసింది. అలాగే డబ్బింగ్, సినిమా ప్రమోషన్స్ లో కూడా సమంత పాల్గొంది.

yashoda movie OTT result..!!

ఈ సినిమాలో సరోగసీ పేరుతో జరిగే కొత్త మోసాల్ని ఆసక్తి కరం గా చూపించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9 న అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ చేసారు. తెలుగు తో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. అయితే ఈ చిత్రం సమంత అభిమానులని ఆకట్టుకున్నా, త్వరగా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసినా దాని ఫలితం యావరేజ్ గా నిలిచింది.

yashoda movie OTT result..!!

అలాగే ఓటీటీ లో కూడా ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకోలేకపోతోంది. ఓటీటీలో కూడా ఈ సినిమా యావరేజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో సామ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సమంత ప్రస్తుతం ఆరోగ్య సమస్యల వల్ల మీడియాకు దూరంగా ఉండటం కూడా ఈ సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపింది. సమంత ఫ్యాన్స్ మాత్రం థియేటర్లలో యశోద మూవీని చూడటం మిస్సైన వాళ్లు ఓటీటీలో కచ్చితంగా చూడాలని చెబుతున్నారు.

yashoda movie OTT result..!!

మరోవైపు శాకుంతలం మూవీకి సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సమంత ప్రస్తుతం ఖుషి మూవీలో నటిస్తున్నారు. అటు విజయ్ దేవరకొండకు ఇటు సమంతకు ఈ సినిమా కీలకమనే సంగతి తెలిసిందే. ఖుషి సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.