మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు బరువు తగ్గటం లేదా.. ఏంటి కారణం అని ఆలోచిస్తున్నారా..
కొంత మంది అధిక బరువుతో బాధపడుతూ తమ ఆహార నియమాలను మార్చుకుంటారు. ఎన్నెన్నో వ్యాయామాలు చేస్తారు. కాని కొంచెం కూడా తమ అధిక బరువును తగ్గించుకోలేరు.
ఎందుకంటే ఈ ఒక్క విటమిన్ లోపం కారణంగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ అధిక బరువు తప్పించుకోలేరు. ఏంటి ఆ విటమిన్ అని ఆలోచిస్తున్నారా.. ఆ విటమినే B12.
మన శరీరానికి విటమిన్ B12 అనేది ఎంతో అవసరం. ఈ విటమిన్ మన శరీరం నాడీ వ్యవస్థను, మెదడును చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఇప్పుడైతే మన శరీరంలో విటమిన్ B12 లోపం ఏర్పడుతుందో మీరు అధిక బరువు పెరగడం, జ్ఞాపకశక్తి తగ్గడం, నరాల బలహీనత, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడతారు.
మరి విటమిన్ B12 అధిక బరువు పెరగడానికి మధ్య సంబంధం ఏంటి అనుకుంటున్నారా..
విటమిన్ బి12 లోపం వలన శరీరంలోని శక్తి స్థాయి తగ్గి మెటబాలిజం మందగించడం ప్రారంభమవుతుంది. ఇప్పుడైతే మెటబాలిజం తగ్గుతుందో తద్వారా మనం బరువు పెరగడానికి ఆస్కారం ఎక్కువ అవుతుంది.
ఈ B12 విటమిన్ లోపం అధిగమించాలి అంటే మన శరీరానికి ప్రోటీన్స్, ఐరన్ ఎంతో అవసరం. ఈ ప్రోటీన్లు, ఐరన్ ను మనకి మాంసం,చేపలు, పప్పుధాన్యాలు కోడిగుడ్లు,పాల ఉత్పత్తులు ద్వారా మనకు లభిస్తాయి. అంతేకాకుండా పాలకూర, తోటకూర, మెంతికూర ద్వారా కూడా మనకి ఐరన్, పోలిక్ యాసిడ్ వంటివి ఎక్కువగా లభిస్తాయి.
B12 లోపాన్ని విటమిన్ సప్లిమెంట్ ల ద్వారా కూడా భర్తీ చేయవచ్చు. విటమిన్ సప్లిమెంట్ వాడే ముందు డాక్టర్ని సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.