Ads
ముల్లంగి సాధారణం గానే మంచి పోషకాలు కలిగిన పదార్ధం. చాలామంది సాంబార్ లోను, సలాడ్ లోను వీటిని తీసుకుంటూ ఉంటారు.. ముల్లంగి లో ఐరన్, క్యాల్షియం, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, ఆంథోసైనిన్స్ అనే పోషకాలు విరివిగా లభిస్తున్నాయి.. డయాబెటిస్, మూత్రపిండాల సమస్యలు, ఉదర సమస్యలు, క్యాన్సర్ సమస్యలు అన్నిటికి ముల్లంగి చక్కటి పరిష్కారం. కానీ, ముల్లంగి ని ఈ నాలుగు పదార్థాలతో కలిపి తినకూడదు. ఎందుకో మీరే చూడండి..
Video Advertisement
నారింజ:
నారింజ పండును, ముల్లంగి ని వెంటవెంటనే తినకూడదంటారు. నారింజ పండు, ముల్లంగి వెంటనే వెంటనే తినడం అంటే అది విషతుల్యమైనది.. నారింజ తిన్నాక ముల్లంగి ని తినాలంటే కనీసం పది గంటల వ్యత్యాసం ఉండాలట. లేదంటే.. జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయట.
కీరదోస:
కీరదోస, ముల్లంగి రెండు ఆరోగ్యకరమైనవి. కానీ ఈ రెండిటిని కలిపి తీసుకోకూడదు. చాలామంది వీటిని సలాడ్ లో ఉపయోగిస్తూ ఉంటారు. కడుపులో ఎలాంటి సమస్యలు రాకూడదు అనుకుంటే.. ఈ రెండిటి లో ఎదో ఒకటి మాత్రమే తినాల్సి ఉంటుంది.
పాలు:
ముల్లంగి తిన్నాక వెంటనే పాలు తీసుకోకూడదు. పాలు మాత్రమే కాదు పాల సంబంధిత పదార్ధాలను కూడా తీసుకోకూడదు. దీనివలన ఉదర సంబంధ సమస్యలు, చర్మ సంబంధ సమస్యలు వస్తాయట.
కాకరకాయ:
కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ ముల్లంగి తిన్న తరువాత కాకరకాయ తినకూడదు. ఈ రెండు తినడానికి మధ్య కనీసం నాలుగు గంటల గ్యాప్ ఉండాలట. లేదంటే ఇబ్బందులు తప్పవట. కాబట్టి మీరు కూడా ముల్లంగి తినేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి.
End of Article