Ads
మన చుట్టూ ఉండేవాళ్ళు అంతా మంచి వాళ్ళు అని మనం అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు వారిలోనే కిలాడీలు కూడా ఉంటారు. కొందరు వ్యక్తుల చీకటి కోణాలు వెలుగులోకి వస్తే తప్ప వారి అసలు స్వరూపం ఏంటో మనకి తెలిసే అవకాశం ఉండదు.
Video Advertisement
బెంగళూరు నగరం చిక్కబాణవర ప్రాంతానికి చెందిన సిఖిందర్, నజ్మా దంపతుల స్టోరీ కూడా అంతే. వీరు స్థానిక టౌన్ షిప్ ప్రాంతం వద్ద టీ స్టాల్ ను నడుపుతున్నారు. భార్య నజ్మా కూడా ఓ దుస్తుల దుకాణంలో పని చేస్తోంది.
వారి పరిసర ప్రాంతాలలో వారికి చాలా మంచి పేరే ఉంది. కష్టపడే స్వభావం ఉండడంతో అందరికి వారిపై మంచి అభిప్రాయం కూడా ఉండేది. అయితే వీరు పగటి పూట సాధారణ జీవనం సాగిస్తూనే.. రాత్రి సమయాల్లో ఎవరికీ తెలియని చీకటి కోణాన్ని బయటపెట్టారు. రాత్రయితే చాలు.. ఈ దంపతులిద్దరూ కలిసి నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దకు వెళ్తారు. ఎవ్వరు లేకుండా గమనించి అక్కడి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బ్యాటరీలను కొట్టేస్తారు.
ఈ బ్యాటరీలను ఒక్కోటి రెండు వేల రూపాయల చొప్పున అమ్ముకుంటారు. వాటిని డీలర్ల దగ్గర అమ్మేసేవారు. ఇలా ఇప్పటివరకు 230 బ్యాటరీలను దొంగలించారు. అయితే.. వీరు దొంగతనం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటుండడంతో.. పోలీసులకు చిక్కలేదు. అయితే.. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను జాగ్రత్తగా పరిశీలించగా.. స్కూటీపై ఇద్దరు దంపతులను గమనించారు. అయితే.. స్కూటీ నెంబర్ కనిపించకుండా చేయడంతో.. పోలీసులు ఆర్డీఓ ను సంప్రదించారు. అలాంటి వాహనాలు కలిగిన ఓనర్స్ ని పిలిపించి.. దోషులెవరో పట్టుకున్నారు. వీరు ఇలాంటి పని చేసారని తెలియడంతో ఆ కాలనిలో ప్రజలంతా అవాక్కవుతున్నారు.
End of Article