Ads
మనుషులకు జంతువులకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఇది ఇప్పటిది కాదు.. ఆదిమానవుడిగా ఉన్నప్పటినుంచే మనిషి జంతువులను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇక ఇప్పటి మోడరన్ యుగంలో సంగతి సరేసరి. చాలా మంది రకరకాల జంతువులను ఇళ్లలో పెంచుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కుక్కపిల్లలు, పిల్లులు, కుందేళ్లు.. ఇలా రకరకాల జంతువుల్ని ఇళ్లల్లో పెంచుకుంటున్నారు.
Video Advertisement
వాటికోసం ప్రత్యేక ఆహార పద్ధతులు పాటించడం, వాటిని కూడా ముస్తాబు చేసి సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ తో పంచుకోవడం.. అబ్బో ఒకటేమిటి.. ఇలా చెప్పుకుంటూ పోతే పెంపుడు జంతువుల హంగామా మాములుగా ఉండదు. అయితే.. ఎవరికీ ఏ పెంపుడు జంతువు ఇష్టమో.. దాన్ని బట్టి మీ మనస్తత్వం ఎలాంటిదో చెప్పేయొచ్చట. అదేంటో తెలుసుకోవాలంటే చివరివరకు చదివేయండి.
కుక్కపిల్లలు:
కుక్కపిల్లలను పెంచుకోవడానికి ఆసక్తి చూపించేవారు ఎక్సట్రావర్ట్ గా ఉంటారట. అందరితోనూ చలాకీగా కలిసిపోతుంటారట. వీరికి స్నేహితులు కూడా ఎక్కువేనట. అయితే…కొంచం పట్టుదల కలిగి ఉంటారట. వీరితో ఉంటె సమయం సరదాగా గడిచిపోతుంది. పైకి సరదాగానే ఉంటారు..కానీ నియమాలు వంటివి పాటించడం లో కూడా నిష్ఠగా ఉంటారట.
పక్షులు:
కొందరికి చిలుకలు, పావురాలు, పిచ్చుకలు వంటి పక్షుల్ని పెంచుకోవడం కూడా ఇష్టంగానే ఉంటుంది. పక్షులను పెంచుకునే వారికి ఇతరులపై ఎక్కువగా జాలి, కరుణ వంటివి ఉంటాయట. వీరు బయట ఎక్కువగా తిరగడానికి ఇష్టపడతారట. మనసులో మాటని ఇతరులని ప్రభావితం చేసేలా చెప్పడం లో వీరు దిట్ట.
పిల్లులు:
పిల్లులని పెంచడానికి ఇష్టపడేవారు ఇంట్రావర్ట్ గా ఉంటారట. వీరు ఎక్కువగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారట. అలాగే.. కెరీర్ విషయంలో కూడా నలుగురు వెళ్లేదారి కాకుండా వీరు తమకంటూ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటారట. వీరు ఎక్కువ క్రియేటివిటీ ని కలిగి ఉంటారట.
పాకే జంతువులు:
తాబేళ్లు, పాములు వంటి నేలపై పాకే జంతువులను కూడా కొందరు పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. వీరు చాలా భిన్నమైన స్వభావం కలిగి ఉంటారట. ఇతరులతో పోలిస్తే చాల స్వతంత్రంగా ప్రవర్తిస్తారట. వీరు ఎక్కువగా హాస్య చతురత కలిగి ఉంటారు. కానీ ఇతరులతో అంత తొందరగా కలిసిపోరట. స్వతంత్రంగా ఉండడానికే ఎక్కువ మక్కువ చూపిస్తారట. వీరు ఏ విషయం లో ఎలా రెస్పాండ్ అవుతారో కూడా చెప్పడం కష్టమేనట.
చేపలు:
చాలా మంది చేపల్ని ఆహరంగా మాత్రమే చూస్తారు. కానీ కొందరు ఒక అక్వేరియం లో చెప్పాలని పెంచుకోవడాన్ని ఇష్టంగా భావిస్తూ ఉంటారు. వీరు చాలా ఫన్నీగా ఉంటారట. ప్రతి చిన్న విషయంపైనా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తారట. భవిష్యత్ పట్ల ఎల్లప్పుడూ ఆశతో ఉంటారట.
కుక్కలను ఇష్టపడేవారు అందరితో కలిసిపోతూ ఉంటారంట… 🤔🤔🤔
End of Article