Ads
వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడిగా రాజకీయ రంగంలోకి ప్రవేశించి, తనకంటూ గుర్తింపు సంపాదించుకొని, నాయకుడిగా ఎదిగారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. గత కొద్ది సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తన పరిపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశారు. ఎన్నో విధాలుగా సౌకర్యాలు అందిస్తున్నారు. ప్రజల బాగోగులు తెలుసుకుంటూ, వారి అవసరాలు తెలుసుకుంటూ, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Video Advertisement
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల వేళ దగ్గర పడుతున్న కారణంగా ప్రచార పనుల్లో ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రజలని చైతన్య పరిచేలాగా మాట్లాడుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి, ఆయన మాటలతో స్ఫూర్తి చెందడానికి ఎన్నో లక్షల మంది ప్రజలు ప్రచార కార్యక్రమాలకి హాజరు అవుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కేటాయిస్తూ ఉంటారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ భారతి దంపతులకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒకరి పేరు వర్ష, ఇంకొకరి పేరు హర్ష. వీరిద్దరూ కూడా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వీరిద్దరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి కూతురు అయిన హర్ష రెడ్డి, కొంత కాలం క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఫ్రాన్స్‌లోని ఫోంటైన్‌బ్లూలో ఉన్న ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్ నుండి హర్ష పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అందుకున్నారు. అక్కడ చదువుకోడానికి సంవత్సరానికి 89 వేల యూరోలు ఖర్చు అవుతాయి అని సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 80 లక్షల రూపాయలు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక హర్ష అక్కడే ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి చిన్న కూతురు పేరు వర్షా రెడ్డి. వర్షా రెడ్డి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చదువుకుంటున్నారు. ఇండియానాలో ఉన్న నోట్రే డామ్ యూనివర్సిటీలో వర్షా రెడ్డి చదువుకుంటున్నారు. అక్కడ ట్యూషన్ ఫీజు దాదాపు 60 వేల డాలర్లు ఉంటుంది. అంటే దాదాపు 50 లక్షల రూపాయలు ఉంటుంది. ప్రస్తుతం వర్షా రెడ్డి ఇంకా చదువుకుంటున్నారు. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి వెళ్లి తమ పిల్లలని చూసి వస్తూ ఉంటారు.
ALSO READ : పెళ్లి కార్డులో ఇలాంటి వివరాలు కూడా పెడతారా..? ఈ వెడ్డింగ్ కార్డ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
End of Article