బిగ్ బాస్ “అఖిల్” గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా.? బ్యాక్గ్రౌండ్ ఏంటంటే.?

బిగ్ బాస్ “అఖిల్” గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా.? బ్యాక్గ్రౌండ్ ఏంటంటే.?

by Mohana Priya

Ads

సీరియల్స్ ద్వారా మనకు పరిచయమయ్యి, బిగ్ బాస్ షో ద్వారా ఇంకా సుపరిచితులు అయ్యారు అఖిల్ సార్థక్. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్స్ చేయడంతో పాటు, పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు అఖిల్. అఖిల్ కి చిన్నప్పటి నుంచే మ్యూజిక్ లో ఆసక్తి ఉండేదట. చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలి అనుకున్నారు.

Video Advertisement

 

ముందు అఖిల్ యాక్టింగ్ లోకి వెళ్ళడానికి వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ తర్వాత ప్రోత్సహించారు. నటన నేర్చుకునే సమయంలో అఖిల్ కి ఇచ్చే డబ్బులు, ఇంటి నుంచి యాక్టింగ్ స్కూల్ కి, యాక్టింగ్ స్కూల్ నుండి ఇంటికి ట్రావెల్ చేయడానికి మాత్రమే సరిపోయేవి.కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో ఆడిషన్స్ కి వెళ్లి రిజెక్ట్ అయ్యారు అఖిల్. క్రిటిసిజం కూడా ఎదుర్కొన్నారు. తర్వాత 2014 లో బావ మరదలు సినిమా లో నెగిటివ్ రోల్ తో కెరీర్ మొదలు పెట్టారు. ఆ సినిమా 2016 లో రిలీజ్ అయింది.

akhil sarthak in mutyala muggu serial

2017 లో ముత్యాల ముగ్గు సీరియల్ తో, సీరియల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తర్వాత ఎవరే నువ్వు మోహిని సీరియల్ లో కూడా నటించారు. ఈ సీరియల్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు అఖిల్. అఖిల్ సినిమా, సీరియల్స్ తో పాటు అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా నటించారు.

2018 లో లవ్ ఫెయిల్యూర్ అవ్వడంతో డిప్రెషన్ లోకి వెళ్లారు. అదే సంవత్సరంలో హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో సెకండ్ రన్నరప్ గా నిలిచారు.2019 లో మట్టి గాజులు, కళ్యాణి సీరియల్స్ లో కూడా నటించారు అఖిల్. అఖిల్ కి దైవభక్తి ఎక్కువే. అఖిల్ చేతి మీద తాండవ్ అని ఒక టాటూ ఉంటుంది. ఈ టాటూ మాత్రమే కాకుండా అఖిల్ కి ఇంకొక టాటూ కూడా ఉంది.

2020 లో బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు. ప్రస్తుతం 8 వ వారం నామినేషన్స్ లో అఖిల్ తో పాటు అమ్మ రాజశేఖర్, హారిక, మెహబూబ్, సోహెల్, అరియానా ఉన్నారు.


End of Article

You may also like