Ads
సాధారణంగా క్రికెట్ కి ఇంకా సినిమాలకి మధ్య ఏదో సంబంధం ఉంటుంది. ఈ రెండింటి ద్వారా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ పొందుతారు అనేది ఒక విషయం. అంతేకాకుండా క్రికెట్ రంగంలో ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు సినిమా రంగంలో ఉన్న సెలబ్రిటీలను ఇష్టపడటం చాలా వరకు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇది చదవగానే మీలో చాలా మందికి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గుర్తొచ్చే ఉంటారు. వీళ్లే కాకుండా యువరాజ్ సింగ్ – హజెల్ కీచ్, హర్భజన్ సింగ్ – గీతా బాస్రా, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ – షర్మిల ఠాగూర్, జహీర్ ఖాన్ – సాగరిక ఘాట్గే కూడా క్రికెటర్ – యాక్టర్ పెయిర్ జాబితాలోకి వస్తారు. ఈ జాబితాలోకి ఇటీవల ఇంకొక జోడి కూడా చేరింది. వాళ్లే మనీష్ పాండే – ఆశ్రిత శెట్టి.
Video Advertisement
2010 లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్లు నిర్వహించిన క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ లో జాతీయ స్థాయిలో విజేతగా నిలిచి ఒక సంవత్సరం పాటు ఫేస్ ఆఫ్ ది బ్రాండ్ అయ్యారు ఆశ్రిత శెట్టి. 2012 లో ఒక తుళు సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టారు.
అంతే కాకుండా ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా నటించారు ఆశ్రిత శెట్టి. 2013 లో సిద్ధార్థ్ హీరోగా నటించిన ఉదయం ఎన్ హెచ్ ఫోర్ చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు. ఈ సినిమా తెలుగులో ఎన్ హెచ్ ఫోర్ పేరుతో డబ్ అయ్యింది.
ashrita shetty in a commercial
ఉదయం ఎన్ హెచ్ ఫోర్ సినిమాలో ఆశ్రిత శెట్టి పర్ఫామెన్స్ ని ఎంతోమంది క్రిటిక్స్ అభినందించారు. తర్వాత 3 తమిళ సినిమాల్లో నటించారు ఆశ్రిత శెట్టి. అందులో రెండు విడుదలవ్వగా ఇంకొకటి షూటింగ్ దశలో ఉంది. 2019లో క్రికెటర్ మనీష్ పాండే ఇంకా ఆశ్రిత శెట్టి పెళ్లి చేసుకున్నారు.
End of Article