పుట్టినరోజు,పెళ్లిరోజు, ఏదైనా స్పెషల్ డే అనగానే సెలబ్రేట్ చేసుకోవడానికి మనకు ముందుగా గుర్తు వచ్చేది ఫుడ్. రకరకాల రుచులు కోసం మనం హోటళ్లకి లేదా రెస్టారెంట్ కి వెళ్తుంటాం.
భోజనం ఆర్డర్ ఇచ్చిన తిన్న తర్వాత మన దగ్గరికి బిల్లు స్లిప్ ప్రత్యక్షమవుతుంది. మనం డైరెక్ట్ గా ఎంత అమౌంట్ అయిందో చూసి డబ్బు చెల్లిస్తాం. ఆ బిల్లులో సర్వీస్ టాక్స్ అనేది ఒకటి ఉంటుంది. కట్టవలసిన అవసరం లేకపోయినా, మనకు తెలియకుండానే చెల్లిచేస్తూంటాం.

మరి కొందరు ఆ సర్వీస్ చార్జెస్ కట్టవలసిన అవసరం లేదని తెలిసినా కూడా అనవసరమైన వాగ్వాదం ఎందుకని, చుట్టు పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని చెల్లించేస్తుంటాం… అసలు సర్వీస్ టాక్స్ అంటే ఏంటి? రెస్టారెంట్ వాళ్ళు ఎందుకు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారు? బలవంతంగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలి అనే విషయం చాలా మందికి తెలియదు.

ఒకప్పుడు హోటల్ వారు మరియు రెస్టారెంట్లు వాళ్ళు ఎన్నో రకాలైన సర్వీస్ టాక్స్ లు విధించేవారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం 5% మాత్రమే టాక్స్ లు తీసుకోవాలి. ఈ జిఎస్టి తప్ప అదనంగా వేరే టాక్స్ లు కట్టరాదు. జీఎస్టీ అమలు లోకి వచ్చిన తర్వాత మిగతా ధరలు ఎలా ఉన్నా, రెస్టారెంట్లో తినే వాటిపై ధరలు చాలావరకు తగ్గాయి.

సర్వీస్ టాక్స్ పన్ను కాదు. ఇది రెస్టారెంట్ మరియు హోటల్ వారు వసూలు చేసుకునేది. ఈ సర్వీస్ టాక్స్ కట్టవలసిన అవసరం కస్టమర్ కి లేదు. సర్వీస్ టాక్స్ కచ్చితంగా కట్టవలసిందే అని రెస్టారెంట్ వాళ్లు అడిగితే కస్టమర్ కన్జ్యూమర్ కోర్టులో కేసు నమోదు చేయవచ్చు.
































































