మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడి గా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘విరూపాక్ష’. రెగ్యులర్ కమర్షియల్ కథ కాకుండా… మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంపిక చేసుకుని సినిమా చేయడం కలిసి వచ్చింది. తెలుగు ప్రేక్షకుల్ని సినిమా మెప్పించింది. వంద కోట్ల వసూళ్ళను రాబట్టింది.
ఈ చిత్రం లో ప్రతి ఒక్కరు అద్భుతం గా నటించారు. చేతబడి నేపథ్యం లో వచ్చిన ఈ చిత్రం అందరి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మూవీ రుద్రవనం అనే ఊరి చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో ఏ సమస్య వచ్చినా ‘ శాసనాల గ్రంథం ‘ లో పరిష్కారం ఉంటుంది అని ఆ ఊరి ప్రజలు విశ్వసిస్తారు.
అయితే రుద్ర వనం పై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్న హీరోయిన్ వేరే శాసనాల గ్రంథాన్ని ఆ స్థానం లో పెడుతుంది. ఆ ఊరి పూజారిగా సాయి చంద్ నటించారు. ఊరికి ఏ సమస్య వచ్చినా ఆయనే ఆ శాసనాల గ్రంథం లో చెక్ చేస్తారు. తాజాగా ఈ అంశం పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
అన్ని సంవత్సరాలు గా పూజారి గారు శాసనాల గ్రంథాన్ని చూస్తున్నారు. మరి అది మారిన విషయం గమనించలేదా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఈ విషయాన్ని ముందే గమనించి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా..అంటూ ఫన్నీ గా రియాక్ట్ అవుతున్నారు.
సాయి ధరమ్ తేజ్ సినీ కెరీర్ లో 15వ చిత్రంగా వచ్చిన ఈ మూవీ తో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మించాయి. విరూపాక్ష బ్లాక్ బాస్టర్ విజయం దిశగా దూసుకు పోతుండడంతో కార్తీక్ దండు కి టాప్ బ్యానర్ల నుండి ఆఫర్లు వస్తున్నాయట. అయితే తన నెక్స్ట్ మూవీ కూడా థ్రిల్లర్ జోనర్ లో నే చేయాలనుకుంటున్నాడట ఈ దర్శకుడు.