తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ ముద్దుగుమ్మ పేరు కూడా ఒకటి. కళ్యాణ్ రామ్ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల విడుదలైన నా సామిరంగ సినిమాలో నాగార్జునతో పాటు నటించిన విషయం తెలిసిందే.
ఇందులో ఏకంగా హీరో నాగార్జున నటనను డామినేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో ప్రస్తుతం హీరోలు దర్శకులు చూపు ఈ ముద్దుగుమ్మ మీద పడింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ ని చూస్తుంటే ఇక మీదట సీనియర్ హీరోలకి ఒక మంచి పెయిర్ దొరికినట్లు అనిపిస్తోంది. సీనియర్ హీరోల సరసన ఈ ముద్దుగుమ్మ బాగా సెట్ అవుతుందని అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. కాగా మొదట ఈ ముద్దుగుమ్మ 2016లో కన్నడలో విడుదలైన క్రేజీ బాయ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన మాస్ లీడర్ అనే సినిమాలో నటించి మెప్పించింది. అలాగే దివంగత నటుడు హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమాలో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

అయితే కన్నడలో తప్పితే ఇతర భాషల్లో ఈమె చాలా తక్కువగా నటించింది. ఆ తర్వాత ఈమె 2022లో అనగా గత ఏడాది పట్టాతు అరసన్ సినిమాతో తమిళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మరి ముందు ముందు ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి మరి.
















అయితే ఒక ప్రైవేటు స్కూల్ ఇందుకు భిన్నంగా స్కూల్ ఫీజును వసూలు చేస్తున్నారు. ఆ ఫీజు పిల్లలకు కానీ, వారి తల్లిదండ్రులకు కానీ ఏమాత్రం కష్టం కాదు. మారి ఆ స్కూల్ ఎక్కడుందో, వారు వసూలు చేస్తున్న ఫీజు ఏమిటో ఇప్పుడు చూద్దాం..





ఇప్పటి వరకు ఆమె ఒక్క సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించలేదు. కానీ, ఆమె పాపులారిటీ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. పలు రకాల ప్రొడక్ట్స్ తమని ప్రమోట్ చేయాలంటూ సితారను అప్రోచ్ అవుతూ ఉంటారు. వాటి ప్రమోషన్స్ తో సితార గట్టిగానే సంపాదిస్తున్నారని చెప్పచ్చు. నెలకు ముప్పై లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.