సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాల మధ్య ఎంతో ధైర్యంతో బరిలోకి దిగింది హనుమాన్. రిలీజ్ చేయడానికి థియేటర్లు కూడా దొరకని పరిస్థితిలో కంటెంట్ మీద నమ్మకంతో సంక్రాంతికి ఎలాగైనా రిలీజ్ చేయాలని పట్టుదలతో ఎన్ని థియేటర్లు దొరికితే అన్నిట్లోనే షో వేశారు మూవీ మేకర్స్. అయితే ఇప్పుడు అదే హనుమాన్ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. ప్రీమియర్ షోలు చూసిన సామాన్యులు పాజిటివ్ టాక్ ఇవ్వటం పక్కన పెడితే సినీ మేధావులు కూడా ఈ సినిమాని ఒక రేంజ్ లో పొగుడుతున్నారు.

దర్శకుడి దర్శకత్వ ప్రతిభ తేజ నటన తో పాటు విఎఫ్ఎక్స్ కూడా ఈ సినిమా ని ఒక రేంజ్ లో నిలబెట్టాయి. యూఎస్ ప్రీమియర్ షోల కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతున్నాయి. ప్రధానంగా హనుమాన్ సినిమా ప్రీమియర్ షోలకు అక్కడ 297 లోకేషన్లలో 553 షోలు ప్రదర్శించారట వీటికి అప్పుడే 82,455 డాలర్స్ వసూల్ అయ్యాయని సమాచారం.అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ విడుదలకు ముందు రోజు రాత్రి నుంచి పెయిడ్ ప్రీమియర్ షోలు వేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్.
ఈ షో లకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఓపెనింగ్స్ పరంగా హనుమాన్ రికార్డు క్రియేట్ చేయడం ఖాయం అనిపిస్తుంది. ఒక్క హైదరాబాదు సిటీలో పెయిడ్ ప్రీమియర్ షో ద్వారా బుధవారం రాత్రికి హనుమాన్ కోటి రూపాయల గ్రాస్ క్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. తెలంగాణ మిగతా జిల్లాలతో పాటు సీడెడ్, ఆంధ్ర, బెంగళూరు కలిపితే పెయిడ్ ప్రీమియర్ కలెక్షన్స్ మినిమం మూడు కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఇక ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో 1.32కోట్లు,తెలంగాణలో 1.02కోట్లు, కేరళలో1.62 కోట్లు కర్ణాటకలో 37.57 లక్షలు, మధ్యప్రదేశ్‌లో 15.63 లక్షలు మహారాష్ట్రలో 22 పాయింట్ 54 లక్షలు గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. ఈ కలెక్షన్స్ హనుమాన్ ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రానున్నట్లు సమాచారం.






ఆ ఫోటో ఉన్న హీరో మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ ఉపేంద్ర. ఆయన గురించి నేటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. ఉపేంద్ర ఏం చేసినా అది సంచలనమే. 1995 నుండి అనేక సంచలనాలు క్రియేట్ చేశాడు. ఇండస్ట్రీలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఉపేంద్ర, వరుస విజయాలను అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా ‘నటించిన ఓం’ మూవీ సంచలన విజయం సాధించి, ఎన్నో అవార్డులను అందుకుంది.
ఈ మూవీ గత 28 సంవత్సరాలలో 550 సార్లు రిరిలీజ్ అయ్యి, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఆ తరువాత టనే హీరోగా నటిస్తూ, కూడా సినిమాలు చేసి, బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు. పదిహేను ఏళ్ళ తర్వాత ఒక తాజాగా ‘యూ ఐ’ అనే చిత్రానికి దర్శకత్వం చేస్తూ, ఉపేంద్ర నటిస్తున్నారు. ఈ మూవీని ఎప్పటిలానే తన శైలిలో ఎవరు ఊహించని కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల నిడివి కల ఈ వీడియో మూవీ పై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ మూవీ కోసం ఉపేంద్ర సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టు తెలుస్తోంది. వింతగా ఉన్న మనుషులు, చివర్లో ఉపేంద్ర గుర్రం పై డిఫరెంట్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు. ఉపేంద్ర డీ గ్లామర్‌గా కనిపిస్తూ ఆడియెన్స్ ను భయపేట్టేలా ఉన్నారు. ఉపేంద్ర ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
గుంటూరు కారం మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నాడు గుంటూరులో జరిగింది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు అయ్యారు. ఇక ఈ ఈవెంట్లో మహేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన చిత్రాలకు రివ్యూ చెప్పే నాన్నగారు ఇప్పుడు లేరని, ఇక అభిమానులే తనకు అమ్మ నాన్న అని ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో హీరోయిన్ శ్రీలీల తన మాటలతోనే కాకుండా, ట్రెండీ శారీలో ఆకట్టుకుంది.
శ్రీలీల బాటిల్ కలర్ గడుల శారీలో స్టైలీష్ లుక్‌లో మెరిసింది. ఈ ఈవెంట్ కు చీరలో మెరిసిన శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె కట్టుకున్న శారీ కొంచెం డిఫరెంట్ గా, స్టైలీష్ గా కనిపించడంతో నెటిజెన్లు ఆ శారీ ఖరీదు మరియు వివరాల గురించి ఆన్లైన్ లో సెర్చింగ్ మొదలుపెట్టారు.
అయితే ఆ శారీ రేటు చూసినవారు షాక్ అవుతున్నారు. ఎందుకంటే శ్రీలీల కట్టుకున్న శారీ ఖరీదు అక్షరాల 1.59.000 రూపాయలు. బాటిల్ గ్రీన్ కట్ వర్క్ శారీ పేరుతో ‘సవన్ గాంధీ’ అనే వెబ్ సైట్ లో ఈ శారీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర చేసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా జనవరి 14 నుండి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించబోతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్ నుండి మొదలయ్యే ఈ యాత్ర 15 రాష్ట్రాల గుండా 6,500 కిలోమీటర్లు సాగి ముంబైలో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్స్, వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బస్సు మరియు కాలినడకన, 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ క్రమంలో వంద లోక్‌సభ స్థానాలను చూడుతూ ఈ యాత్ర ముంబైలో ముగుస్తుంది. ఇండియా కూటమి నాయకులను కూడా ఈ యాత్రకు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ యాత్రకు సంఘీభావంగా యాత్రకు సంబంధించిన పోస్టర్ ను స్వయంగా తానే తన వాహనానికి అతికించారు. ఆ పోస్టర్ లో రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, భారత్ జోడో న్యాయ్ యాత్ర అని ఉంది. ఈ పోటోలను ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.
“ఈ నెల 14న భారతదేశంలో మరో మహా యాత్రకు శ్రీ రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్నారు. గాయపడ్డ మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమవుతున్నారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడి యాత్రకు నా సంఘీభావాన్ని సింబాలిక్ గా తెలిపేందుకు యాత్ర పోస్టర్ ను నేనే స్వయంగా నా వాహనానికి అతికించి ప్రతి కార్యకర్తకు కర్తవ్య బోధ చేస్తున్నాను.”
అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఝార్ఖండ్ లోని ధన్‌బాద్ జిల్లా, కరమ్‌తాండ్ కు చెందిన సరస్వతి దేవి కు శ్రీరాముడంటే అమితమైన భక్తి. 1992లో బాబ్రీ మసీదు కూల్చిన అనంతరం సరస్వతి అయోధ్యను సందర్శించారు. ఆ సమయంలో అక్కడ తిరిగి రామ మందిరం నిర్మించే వరకూ మౌనవ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇక అప్పటి నుండి తనకు ఏం కావాలన్నా సైగలతో మాత్రమే అడగటం ప్రారంభించారు. అయితే రోజులో సరస్వతి గంట సేపు మాత్రమే తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండేవారు.
2020లో ప్రధాని మోదీ అయోధ్యలో రామమందిర నిర్మించడం కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన తరువాత సరస్వతి దేవి 24 గంటల పాటు మౌనవ్రతం పాటిస్తూ వస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ట తరువాత ఆమె మౌనం వీడనుంది. ఇక రామ మందిర ప్రారంభోత్సవంకు ఆమెకు ఆహ్వానం అందింది.
సరస్వతి దేవి సోమవారం నాడే అయోధ్యకు ప్రయాణం అయ్యారు. రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆమె మౌనవ్రతాన్ని వీడుతుందని ఆమె కొడుకు హరే రామ్ అగర్వాల్ వెల్లడించారు. స్థానిక ప్రజలు ఆమెను ‘మౌనీమాత’ అని పిలుస్తారు. 1986లో సరస్వతి దేవి భర్త మరణించిన తర్వాత ఆమె తన జీవితాన్నిరామ స్మరణకే అంకితం చేసిందని, యాత్రలు ఎక్కువగా చేస్తారని హరేరామ్ చెప్పుకొచ్చారు.