ప్రశాంత్ వర్మ అనే పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తూ తేజ సజ్జ, అమృత అయ్యర్లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘హనుమాన్’. ఈ సినిమా జనవరి 12 సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ సినిమా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. థియేటర్స్ విషయంలో జరుగుతున్న హవా వలన ఈ సినిమాకు మరింత హైప్ పెరిగిపోయింది.

ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్, టీజర్ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మీద ఎంతో మంది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ చూపిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమా వెళ్లదు అని మొండిగా కూర్చున్నారు ఈ చిత్రం బృందం. ఎలాగైనా సంక్రాంతికి హిట్ కొడతాము అని ధైర్యంగా ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు ప్రశాంత్ వర్మ.

అయితే ఒక ఇంటర్వ్యూలో ఒకవేళ మీరే గాని మహాభారతం తీయాల్సి వస్తే అందులో కర్ణుడి పాత్రలో ఏ హీరోని పెడదాం అనుకుంటున్నారు అని యాంకర్ అడగగా పవన్ కళ్యాణ్ ని పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే కర్ణుడు అంటే మనకి గుర్తొచ్చేది బాధలు మాత్రమే. కానీ కర్ణుడు ఎవరేమనుకున్నా పట్టు పట్టి తను చేయాలనుకున్నదే తను చేస్తాడు.. దేనికోసమైనా ఫైట్ చేయాలనుకుంటే ఎవరిని పట్టించుకోడు.

పవన్ కళ్యాణ్ గారి విషయంలో నాకు అదే ఆటిట్యూడ్ కనిపిస్తుంది. తను ఏదో చేయాలనుకుంటున్నారు. ఆ ఆటిట్యూడ్ కర్ణుడిలో ఉంటుంది. అందుకే కర్ణుడు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు సరిపోతారు అని పేర్కొన్నారు ప్రశాంత్ వర్మ. అయితే ఈ మాటలు విన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వాహ్ ఏం చెప్పావన్న అని ప్రశాంత్ వర్మ ని పొగిడేస్తున్నారు. ఇదిలా ఉండగా మరి హనుమాన్ సినిమా సంక్రాంతి రేసులో నిలిచి హిట్ కొడుతుందో లేదో తెలియాలంటే జనవరి 12 వరకు ఎదురు చూడాల్సిందే.








వైఎస్ఆర్ బయోపిక్ గా వచ్చిన యాత్ర మూవీలో వైఎస్ఆర్ గా మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ మూవీ 2019 ఫిబ్రవరి 8న రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు వై.ఎస్.జగన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న యాత్ర 2ను సైతం ఈ ఏడాది అదే డేట్ కి రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. యాత్ర2 లో కూడా మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా కనిపిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో వైఎస్ జగన్ పాలిటిక్స్ లోకి రావటానికి కారణాన్ని ఎమోషనల్ చూపించారు. జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్ డైరీ వంటివి చూపించారు. అయితే టీజర్ లో అందరినీ ఆకట్టుకుంది వైఎస్ఆర్ డైరీ. సగం కాలిన ఆ డైరీలోని ఓ పేజీలో ‘ఆరోగ్య శ్రీ బీమా ఇవ్వాలి.. కేంద్ర నిధులు రావాలి’ అని ఉంది. అలా తన డైరీలో ఆరోగ్య శ్రీ బీమా గురించి రాసుకోవడం చిన్న విషయం కాదు.
ప్రజల గురించి ఎంత ఆలోచించి ఉంటే తప్ప వైఎస్ రాజశేఖర్ రెడ్డి డైరీలో రాసుకోరు. జీవిత ధ్యేయం అయితే కానీ ఎవరు డైరీలో అలా రాసుకోరు అని అంటున్నారు. టీజర్ లో డైరీ కొంచెం కాలిపోయినట్టుగా కనిపిస్తోంది. దాన్ని ఎవరైనా కాల్చరా? లేదా ఏదైనా ప్రమాదం జరిగి కాలినట్టుగా కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆ టైమ్ లో ఈ డైరీ దొరికిందా? అనేది మూవీ రిలీజ్ అయితే కానీ తెలీదు.
ఇప్పుడు ఆ సినిమా వివరాలు, విశేషాలు ఎందుకంటారా అక్కడికే వస్తున్నాం ఈ సినిమాలో హీరోగా దీపక్ నటించాడు. కాగా హీరోయిన్ గా కంచికౌల్ నటించింది. ముస్లిం అమ్మాయిగా నటించి యువత మనసు కొల్లగొట్టింది ఈ భామ. మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత ఫ్యామిలీ సర్కస్, మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు వంటి సినిమాల్లో నటించింది.కానీ ఆ తరువాత ఎందుకో అనుకున్నంత సక్సెస్ ని సాధించలేకపోయింది.

రాజస్థాన్లోని జై సల్మేర్ లోని ధార్ ఎడారి కి సమీపంలో సిద్ధ తనోత్ రాయ్ మాత ఆలయం ఉంది. 1965,1971 యుద్ధాల సమయంలో జై సల్మేర్ లోని భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ అనేకసార్లు ఈ ఆలయం పై బాంబులు విసిరింది కానీ ఒక్కటి కూడా పేలలేదు. ఆ బాంబులు అన్నీ ఇండియన్ ఆర్మీ అదే ఆలయంలోని మ్యూజియంలో ఉంచింది. ఇలా ఈ ఆలయం పై పాకిస్తాన్ ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా వేలసార్లు ఇలాంటి దాడికి పాల్పడింది.

