వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా వివాదం సృష్టించేల రూపొందింస్తున్న చిత్రం వ్యూహం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రతిబింబించేలా తర్కెక్కించాడు. రాంగోపాల్ వర్మ వైసిపి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడుని, లోకేష్ ని, జనసేన అధినేతని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వ్యూహం సినిమాని తీశారు.

అయితే ఈ సినిమాని ముందుగా నవంబర్ నెలలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.అయితే ఇది నిజ జీవిత వ్యక్తులను టార్గెట్ చేసే విధంగా ఉంది అంటూ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసేందుకు నిరాకరించింది. అయితే ఇప్పుడు ఆ సమస్యలన్నీ తొలగిపోయి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందంటూ వర్మ ప్రకటించారు. ఈ సినిమాని రెండు పార్ట్ లుగా రూపొందించారు. మొదటి పార్ట్ వ్యూహం డిసెంబర్ 29 విడుదల కానుండగా రెండవ పార్ట్ శపధం జనవరి 25న విడుదల కానుంది.
ఈ సినిమాలో వైయస్ జగన్ పాత్రలో అజ్మల్, వైయస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించారు. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు. బ్యాడ్ పీపుల్ కి బ్యాడ్ న్యూస్ అంటూ వర్మ ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను చూపిస్తూ పోస్ట్ పెట్టారు.







1. మహేష్ బాబు:
2. రామ్ చరణ్:
3. వరుణ్ తేజ్:
4. మెగాస్టార్ చిరంజీవి:
5. అఖిల్ అక్కినేని:
6. అక్షయ్ కుమార్:
7. షారుఖ్ ఖాన్:
8. ముస్తఫా బర్మావాలా:
9. అమీర్ ఖాన్:
భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, ఘోర పరాజయం పాలైంది. దీంతో అమీర్ ఖాన్ అభిమానులకి క్షమాపణలు చెప్పారు.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ బుల్లితెర పై సత్యమేవ జయతే అనే టాక్ షోతో ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా, సామాజిక సమస్యల పై రియాలిటీ టాక్ షోను మొదలుపెట్టాడు. సత్యమేవ జయతే మొదటి సీజన్ 2012లో మే 6న ప్రసారం అయ్యింది. ఈ షో డీడీ నేషనల్, స్టార్ వరల్డ్ తో పాటుగా మొత్తం పది ఛానెల్స్ లో ప్రసారం అయ్యింది. ఈ షోలో భారతదేశంలో ప్రబలంగా ఉన్న ఆడపిల్లల భ్రూణహత్యలు, పిల్లల లైంగిక వేధింపులు, అత్యాచారం, పరువు హత్యలు, గృహ హింస లాంటి సున్నితమైన సామాజిక సమస్యల పై దృష్టి సారించింది.
అంటరానితనం, వివక్ష, ప్రత్యామ్నాయ లైంగికతలను అంగీకరించడం, విషపురుషత్వం, మద్యపానం మరియు నేర రాజకీయాల మెడికల్ మాఫియా గురించి ఈ షోలో చర్చించారు. యువత వారి లక్ష్యాలను సాధించడానికి, ప్రేక్షకులను ప్రోత్సహించడానికి గొప్ప విజయాలు సాధించి, గుర్తింపు పొందని వ్యక్తులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ షో సాగింది. పౌరులకు వారి దేశం గురించిన సమాచారంలో సాధికారత కల్పించడం మరియు చర్య తీసుకోవాలని వారిని కోరడం కూడా దీని లక్ష్యం. ఈ షో హిందీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు లాంటి 8 భాషలలో ఏకకాలంలో ప్రసారం చేయబడింది. అందరికి రీచ్ కావడానికి వీలుగా ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ ప్రసారం చేశారు.
ఈ షో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. సత్యమేవ జయతే మొదటి సీజన్ కు 165 దేశాల నుండి బిలియన్ డిజిటల్ ఇంప్రెషన్లను పొందింది. పలు దేశాలలో వ్యూయర్స్ నుండి ప్రతిస్పందనలతో, మిలియన్ల మంది ప్రజలు ఈ షోకు మద్దతు ఇచ్చారు. రెండో సీజన్‌ను 600 మిలియన్ల మంది ఇండియన్స్ చూశారు. అయితే ఈ షో కొన్ని కారణాల వల్ల ఆపేశారు. ఎందుకనేది తెలినప్పటికి సమాజంలో జరిగే ఎన్నో విషయాల గురించి ఈ షో మాట్లాడింది. ఈ షోకి మరిన్ని సీజన్స్ వస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు.

