ఇంత మంచి షోని ఎందుకు ఆపేశారు..? ఈ షో చూశారా..?

ఇంత మంచి షోని ఎందుకు ఆపేశారు..? ఈ షో చూశారా..?

by kavitha

Ads

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోగా నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. బాలీవుడ్ లో ఎన్నో రికార్డులు సృష్టించారు. బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చిన అమీర్ ఖాన్ సంచలనం సృష్టించారు.

Video Advertisement

అమీర్ ఖాన్ సత్యమేవ జయతే అనే టాక్ షోను కూడా నిర్వహించారు.  2012 లో ప్రారంభం అయిన ఈ షో 2014 వరకు కొనసాగింది. ఈ షో అనేక సామాజిక సమస్యల గురించి వెలుగులోకి తీసుకొచ్చి, వాటి పై చర్చలు జరిపారు. అయితే ఈ టాక్ షో అర్ధాంతరంగా ఆపేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ బుల్లితెర పై సత్యమేవ జయతే అనే టాక్ షోతో ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా, సామాజిక సమస్యల పై రియాలిటీ టాక్ షోను మొదలుపెట్టాడు. సత్యమేవ జయతే మొదటి సీజన్ 2012లో మే 6న ప్రసారం అయ్యింది. ఈ షో డీడీ నేషనల్, స్టార్ వరల్డ్ తో పాటుగా మొత్తం పది ఛానెల్స్ లో ప్రసారం అయ్యింది. ఈ షోలో భారతదేశంలో ప్రబలంగా ఉన్న ఆడపిల్లల భ్రూణహత్యలు, పిల్లల లైంగిక వేధింపులు, అత్యాచారం, పరువు హత్యలు, గృహ హింస లాంటి సున్నితమైన సామాజిక సమస్యల పై దృష్టి సారించింది.
అంటరానితనం, వివక్ష, ప్రత్యామ్నాయ లైంగికతలను అంగీకరించడం, విషపురుషత్వం, మద్యపానం మరియు నేర రాజకీయాల మెడికల్ మాఫియా గురించి ఈ షోలో చర్చించారు. యువత వారి లక్ష్యాలను సాధించడానికి, ప్రేక్షకులను ప్రోత్సహించడానికి గొప్ప విజయాలు సాధించి, గుర్తింపు పొందని వ్యక్తులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ షో సాగింది. పౌరులకు వారి దేశం గురించిన సమాచారంలో సాధికారత కల్పించడం మరియు చర్య తీసుకోవాలని వారిని కోరడం కూడా దీని లక్ష్యం. ఈ షో హిందీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు లాంటి 8 భాషలలో ఏకకాలంలో ప్రసారం చేయబడింది. అందరికి రీచ్ కావడానికి వీలుగా ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ ప్రసారం చేశారు.
ఈ షో మూడు సీజన్‌లను పూర్తి చేసుకుంది. సత్యమేవ జయతే మొదటి సీజన్ కు 165 దేశాల నుండి బిలియన్ డిజిటల్ ఇంప్రెషన్‌లను పొందింది. పలు దేశాలలో వ్యూయర్స్ నుండి ప్రతిస్పందనలతో, మిలియన్ల మంది ప్రజలు ఈ షోకు మద్దతు ఇచ్చారు. రెండో సీజన్‌ను 600 మిలియన్ల మంది ఇండియన్స్ చూశారు. అయితే ఈ షో కొన్ని కారణాల వల్ల ఆపేశారు. ఎందుకనేది తెలినప్పటికి సమాజంలో జరిగే ఎన్నో విషయాల గురించి ఈ షో మాట్లాడింది. ఈ షోకి మరిన్ని సీజన్స్ వస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు.

Also Read: ఎవరు ఈ పక్కింటి కుర్రాడు… ఇతని అసలు పేరేంటి..? ఏ కారణంతో అరెస్టు చేశారు..?


End of Article

You may also like