ప్రియమైన పవన్ అన్నకి,
నిన్ను అలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నా. ఈ ఒక్క క్షణం కోసం ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూసాం. ఎంతో ఓపిక పట్టాం. చాలు. నిన్ను అలా చూస్తూ ఉంటే ఈ కష్టానికి ఫలితం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు బాధపడితే, నేను బాధపడే వాడిని. నువ్వు ఏడిస్తే, నేను ఏడ్చేవాడిని. నీకు కోపం వస్తే, నాకు కూడా కోపం వచ్చేది. నువ్వు ఆనందపడితే, నేను కూడా ఆనందపడే వాడిని. నువ్వు సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వస్తున్నావు అంటే భయం వేసింది అన్నా. నువ్వు మాకు దగ్గర అయ్యిందే సినిమాల ద్వారా. అలాంటి నువ్వు సినిమాలు మానేస్తున్నాను అంటే జీర్ణించుకోలేకపోయాను.

సాధారణంగా చాలా మంది సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్తారు. కానీ నువ్వు వెళ్తున్నావు అని అసలు అనుకోలేదు. కానీ నువ్వు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు. అందుకే, నీకు ఎలా మద్దతు ఇవ్వాలి అనే విషయమే ఆలోచించాను. అజ్ఞాతవాసి సినిమా పోయినప్పుడు చాలా బాధగా అనిపించింది అన్నా. సినిమా పోయినందుకు కాదు. దీని తర్వాత మళ్లీ నువ్వు సినిమాలు చేయవు అని తెలిసి చాలా బాధగా అనిపించింది. కానీ మళ్ళీ వకీల్ సాబ్ సినిమా చేసావు.. ఆ తర్వాత సినిమాలు చేస్తూ వస్తున్నావు. ఎన్ని చేస్తున్నా కూడా రాజకీయాల్లో నువ్వు ముందుకు వెళ్లట్లేదు అన్న అసంతృప్తి నీ ముఖంలో కనిపించేది.
నువ్వు అలా బాధపడుతూ ఉంటే, మాకు కూడా బాధగా అనిపించేది. ఎలాగైనా సరే ఈసారి నువ్వు గెలవాలి అని అనుకున్నాం. నేను మాత్రమే కాదు. నాలాగా ఎన్నో కోట్ల మంది నీ అభిమానులు ఇదే విషయం అనుకున్నారు. అందుకే ఇవాళ ఈ విజయం నీ ఒక్కడిది కాదు. నీతో పాటు ఈ కోట్ల మంది అభిమానులం కూడా గెలిచాం. నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కన్నీళ్లు ఆగలేదు. నువ్వు ఇలాగే ధైర్యంగా ముందుకు వెళ్లాలి అన్నా. నీ వెంట మేము ఉన్నాం. ఎప్పటికీ ఉంటాం.
ఇట్లు,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి అభిమాని.


మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో సినిమాను తాజాగా ప్రకటించారు. రవితేజ హరీష్ శంకర్‌కు డైరెక్టర్ గా ‘షాక్’ మూవీతో ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. ఆ తర్వాత రవితేజ ‘మిరపకాయ్’ సినిమాతో హరీష్‌కు రెండవసారి అవకాశం ఇచ్చారు. ఈ మూవీ విజయం సాధించింది. ఈ మూవీతోనే రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ వచ్చింది. పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుంది. వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడవ సినిమా ఇది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.
ఈ మూవీ బాలీవుడ్ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ‘రైడ్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారని సమాచారం. 2018లో వచ్చిన రైడ్ మూవీలో అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఒక విలేజ్ లో అక్రమాస్తులు, బ్లాక్ మనీ అన్యాయంగా సంపాదించి, దాచిపెట్టిన వ్యక్తి ఇంటి పైకి రైడింగ్ చేసే ఇన్ కమ్ టాక్స్ అధికారి కథనే ఈ మూవీ.
కోలీవుడ్ హీరో సూర్య నటించిన ‘గ్యాంగ్’ మూవీతో పోలికలు ఉంటాయి. అయితే ఈ మూవీ అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ మూవీ ‘స్పెషల్ 26’ రీమేక్ గా తెరకెక్కిందని తెలుస్తోంది. ఆల్రెడీ వచ్చిన ఈ మూడు సినిమాలను ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులు చూశారు. మళ్ళీ రీమేక్ చేయడానికి అంతగా ఏముందని అంటున్నారు.









