కార్తీకదీపం తర్వాత అదే స్లాట్ లో వస్తున్న బ్రహ్మముడి సీరియల్ పై అందరికీ అనుమానాలు ఉండేవి. కార్తీకదీపం రేంజ్ కి చేరుకుంటుందా, ఈ సీరియల్ ఎలా ఉండబోతుంది అంటూ. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ బ్రహ్మముడి సీరియల్ ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. అందులో నటీనటులు సైతం తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అందులో కావ్య పాత్ర పోషిస్తున్న దీపిక రంగరాజు అయితే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయింది. నిజానికి ఈమె ఒక తమిళ అమ్మాయి. కానీ ఆ ఛాయలు ఎక్కడ కనిపించకపోవడంతో తెలుగు వాళ్ళందరూ వాళ్ళ ఇంటి పిల్లగానే చూస్తున్నారు. ముఖ్యంగా ఆమె చిలిపితనానికి అందరూ ఫిదా అయిపోయారు. ఏ భాష వాళ్ళైనా సరే తమకు నచ్చితే తెలుగు ఆడియన్స్ గుండెల్లో పెట్టి చూసుకుంటారనే సంగతి తెలిసిందే కదా. దీపికకి కూడా ఇదే ఫస్ట్ తెలుగు సీరియల్.

అయినా తడబడకుండా ఎంతో బాగా నటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాలని గెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ దీపిక తన చిన్నప్పటి రెండు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి దీపిక కి, అప్పటి దీపికకి అస్సలు పోలికలు లేవు. ఎవరూ చెప్పకపోతే అది కావ్య ఫోటో అని ఎవరు గుర్తించలేని విధంగా ఉంది ఆ ఫోటో.

అయితే అప్పటి ఫోటోలో కూడా దీపిక చాలా క్యూట్ గా బూరె బుగ్గల తో ఉంది అంటూ ఆడియన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. అప్పుడు ఏమో గాని ఇప్పుడు మాత్రం అదిరిపోయారు అంటూ తెగ మెచ్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలంతా తమ పాత కొత్త ఫోటోలని షేర్ చేయటం కొత్త ట్రెండు ఆ ట్రెండ్ ని మన కావ్య పాప కూడా ఫాలో అయ్యి తన ఫోటోలని షేర్ చేసింది. ఈ మధ్యనే స్టార్ మా పరివారంలో ఉత్తమ డాటర్ అవార్డు కూడా ఈమెకే దక్కడం గమనార్హం.
https://www.instagram.com/reel/C0bxBqeRXZ2/








పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మెగా బ్రదర్ నాగబాబు తన సొంత బ్యానర్ అయిన అంజన ప్రొడక్షన్స్ లో గుడుంబా శంకర్ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి వీర శంకర్ దర్శకత్వం వహించారు. యాక్షన్ కామెడీ మూవీగా రూపొందిన ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి, ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఈ మూవీని పవన్ కెరీర్లో ప్లాప్ మూవీగానే చెబుతుంటారు. కానీ ఈ చిత్రంలో కామెడీ సూపర్ అనే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. ఈ మూవీని ఆగష్టు 31న రీరిలీజ్ చేయనున్నట్లు నాగబాబు ప్రకటించారు. అయితే ఈ సినిమాను 2 రోజుల తరువాత పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న రీరిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
ఇది ఇలా ఉంటే ఒక ట్విట్టర్ యూజర్ గుడుంబా శంకర్ మూవీలోని సీన్స్ కు సంబంధించిన ఫోటోలను, అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ పాటకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. రెండింటిలోనూ పవన్ కళ్యాణ్ సేమ్ కాస్ట్యూమ్స్ ధరించినట్టు కనిపిస్తోంది. ఆ ఫోటోలకు ఆ యూజర్ ‘నీకు ఏం కాదు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి రాత్రి కళ్ళు కాంపౌండ్ కి వెళ్తాడు ఉస్తాద్’ అని రాసుకొచ్చారు.
సోషల్ మీడియా వచ్చాక చాలా మంది అక్కడే ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నారు. అవకాశాలను సృష్టించుకుంటున్నారు. అలా వచ్చిన వారే మీమర్స్. స్టార్ హీరో దగ్గరినుంచి మొదలు పెడితే బంగాళా దుంప వరకు అన్నిటినీ మీమ్స్ లో వాడుతున్నారు. జోక్స్ నుంచి వేదాంతం వరకు ఏదైనా వాడేస్తున్నారు. మీమర్స్ శ్రీ శ్రీ అన్న కాదేదీ కవిత కనర్హం అన్న వాక్యాన్ని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు.








