Home serials GUESS THE SERIAL HEROINE: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇప్పుడు స్టార్ సీరియల్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

GUESS THE SERIAL HEROINE: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇప్పుడు స్టార్ సీరియల్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

by Sainath Gopi

కార్తీకదీపం తర్వాత అదే స్లాట్ లో వస్తున్న బ్రహ్మముడి సీరియల్ పై అందరికీ అనుమానాలు ఉండేవి. కార్తీకదీపం రేంజ్ కి చేరుకుంటుందా, ఈ సీరియల్ ఎలా ఉండబోతుంది అంటూ. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ బ్రహ్మముడి సీరియల్ ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. అందులో నటీనటులు సైతం తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అందులో కావ్య పాత్ర పోషిస్తున్న దీపిక రంగరాజు అయితే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయింది. నిజానికి ఈమె ఒక తమిళ అమ్మాయి. కానీ ఆ ఛాయలు ఎక్కడ కనిపించకపోవడంతో తెలుగు వాళ్ళందరూ వాళ్ళ ఇంటి పిల్లగానే చూస్తున్నారు. ముఖ్యంగా ఆమె చిలిపితనానికి అందరూ ఫిదా అయిపోయారు. ఏ భాష వాళ్ళైనా సరే తమకు నచ్చితే తెలుగు ఆడియన్స్ గుండెల్లో పెట్టి చూసుకుంటారనే సంగతి తెలిసిందే కదా. దీపికకి కూడా ఇదే ఫస్ట్ తెలుగు సీరియల్.

brahmamudi serial heroine deepika about karthika deepam serial..

అయినా తడబడకుండా ఎంతో బాగా నటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాలని గెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ దీపిక తన చిన్నప్పటి రెండు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి దీపిక కి, అప్పటి దీపికకి అస్సలు పోలికలు లేవు. ఎవరూ చెప్పకపోతే అది కావ్య ఫోటో అని ఎవరు గుర్తించలేని విధంగా ఉంది ఆ ఫోటో.

అయితే అప్పటి ఫోటోలో కూడా దీపిక చాలా క్యూట్ గా బూరె బుగ్గల తో ఉంది అంటూ ఆడియన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. అప్పుడు ఏమో గాని ఇప్పుడు మాత్రం అదిరిపోయారు అంటూ తెగ మెచ్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలంతా తమ పాత కొత్త ఫోటోలని షేర్ చేయటం కొత్త ట్రెండు ఆ ట్రెండ్ ని మన కావ్య పాప కూడా ఫాలో అయ్యి తన ఫోటోలని షేర్ చేసింది. ఈ మధ్యనే స్టార్ మా పరివారంలో ఉత్తమ డాటర్ అవార్డు కూడా ఈమెకే దక్కడం గమనార్హం.

https://www.instagram.com/reel/C0bxBqeRXZ2/

You may also like