ఐసీసీ ప్రపంచకప్ 2023 చివరి దశకు చేరుకుంది. మూడు లీగ్ మ్యాచులు మాత్రమే ఉన్నాయి. ఆ మ్యాచ్ ల తర్వాత నాకౌట్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. అసలు కిక్ మొదలయ్యేది అప్పుడే అనే విషయం తెలిసిందే. లీగ్ దశలో ఓడినపుడు మరో అవకాశం ఉంటుంది. అయితే నాకౌట్ లో ఓడిన జట్టు మాత్రం ఇంటికి వెళ్ళాల్సిందే.
ఈ టోర్నీలో భారత జట్టు అద్భుతంగా ఆడి, సెమీస్ కు దూసుకెళ్లింది. అయితే, టీమిండియాకు సెమీఫైనల్ మ్యాచులు పెద్దగా కలిసి రావు. 2011 లో కప్ గెలిచిన తరువాత సెమీస్ గండాన్ని దాటలేకపోయింది. ఈసారి మాత్రం టీమిండియా అతి పెద్ద బలం ఈ గండాన్ని దాటి, కప్ ను సాధిస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
వన్డే వరల్డ్ కప్ 2023 భారత జట్టు ఇప్పటి వరుకు ఆడిన 8 మ్యాచుల్లో, 8 విజయాలు సాధించి, సెమీస్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా 2015, 2019 ప్రపంచ కప్ టోర్నీలలో సెమీస్ ను దాటలేకపోయింది. ఈసారి జట్టు అద్భుతంగా రాణిస్తుండడంతో ఆ గండాన్ని దాటుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జట్టుకు అండగా అతి పెద్ద బలంగా రోహిత్ శర్మ ఉండడం వల్ల సెమీస్ గండాన్ని దాటి, కప్ ను అందుకుంటారని అభిమానులు అనుకుంటున్నారు.
టీమిండియా సారధి రోహిత్ శర్మ సెంచరీలు, సెంచరీలు చేయకపోయినా, ఓపెనర్ గా ఆరంభంలోనే తన దూకుడు బ్యాటింగ్ తో ప్రత్యర్ధి జట్టును డిఫెన్స్ లో పడేశాడు. ఆస్ట్రేలియాతో ఆడిన మొదటి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ మొదట్లోనే అవుట్ అయినా, ఆ తరువాత మ్యాచ్ లలో ఇన్నింగ్స్ మొదటి నుండే ఫోర్లు, సిక్సర్లతో అవతలి జట్టుకు చుక్కలు చూపించాడు. అవుట్ అయ్యేలోపు భారత జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తూ, గెలుపుకు పునాది వేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అర్ధ సెంచరీలు, సెంచరీ చేయలేకపోతున్నాడు.
వ్యక్తిగత రికార్డులకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా, రోహిత్ శర్మ టీమిండియా కోసమే ఆడుతున్నాడు. 8 మ్యాచుల్లో 442 రన్స్ చేశాడు. అవి కూడా వందకి పైన స్టైక్ రేట్ తో, ఇదే అతని ఆటను తెలియయచేస్తుంది. సారధ్యం విషయంలో సైతం రోహిత్ శర్మ తన మార్కును చూపిస్తున్నాడు. రోహిత్ శర్మ ప్రపంచ కప్ 2023 టోర్నీలో ఫీల్డ్ సెట్టింగ్, బౌలర్లను ఉపయోగించుకున్న విధానం, డీఆర్ఎస్ వాడిన తీరు హైలెట్ గా అనవచ్చు. ఇలా ఆరంభ ఇన్నింగ్స్ మరియు కెప్టెన్సీ తో టీమిండియా రోహిత్ శర్మ అతి పెద్ద బలంగా మారాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read: ప్రపంచ కప్ ఫైనల్ 2023 కి చేరేది 2 జట్లు ఇవేనా..? ఇందులో ఎంత వరకు నిజం అవుతుంది..?

చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఆయన 1942లో కృష్ణాజిల్లాలోని పమిడిముక్కలలో మే 23న జన్మించారు. 1966లో రంగులరాట్నం అనే సినిమాతో చంద్రమోహన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తొలి సినిమాతోనే నంది అవార్డ్ ను అందుకున్నారు. కెరీర్ మొదట్లో హీరోగా నటించిన చంద్రమోహన్, 175 పైగా సినిమాలలో హీరోగా చేశారు. ఆ తరువాత ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించిన ఆయన మొత్తం 932 చిత్రాలలో నటించాడు.
సెకండ్ హీరోగా, హీరోగా, కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా వైవిధ్యమైన క్యారెక్టర్లలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కామెడీ పాత్రల ద్వారా ఆయన తెలుగు ఆడియెన్స్ మనసులో చెరిగిపోని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్స్ కి చంద్రమోహన్‌ను లక్కీ హీరోగా చెబుతారు. ఆయన పక్కన నటించిన హీరోయిన్స్ ఆ తరువాతి కాలంలో టాప్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీని ఏలారు. వారిలో జయప్రద, జయసుధ, శ్రీదేవి, సుహాసిని, విజయశాంతి వరకు చాలా మంది ఉన్నారు. వారంతా కెరీర్ తొలినాళ్లలో చంద్రమోహన్ తో నటించినవారే.
చంద్రమోహన్ కెరీర్ లో ఆయన నటనకు గానూ 2 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. ఆయన భార్య పేరు జలంధర. మంచి రచయిత్రి. పలు కథా సంకలనాలను రాశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, మధుర మీనాక్షీ అమెరికాలో స్థిరపడింది. రెండవ కుమార్తె మాధవి డాక్టర్ చెన్నైలో స్థిరపడింది.
విషయం తెలియగానే ఇంటికి వచ్చిన బాలిక కుటుంబసభ్యులు రూమ్ బయట వైపు తాళం వేశారు. ఆ తరువాత కొందర్ని పిలిచి ఆ యువకుడి పై దాడి చేశారు. దారుణంగా కొట్టి, దాదాపు 3 గంటల పాటు అతన్ని చిత్ర-హిం-స-ల-కు గురి చేసి, కుమార్తెకు జోలికి మళ్ళీ రావద్దని వార్నింగ్ ఇచ్చి, విడిచిపెట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు తన ఇంటికి వెళ్ళి, కిందపడి అపస్మారక స్థితికి వెళ్లాడు.
కరణ్ కుటుంబసభ్యులు అతన్ని వెంటనే ఘట్కేసర్ గవర్నమెంట్ హాస్పటల్ కి తరలించారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు, అప్పటికే అతడు మరణించినట్టుగా ధ్రువీకరించారు. కరణ్ తల్లి సుశీల కంప్లైంట్ చేయడంతో, ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి, కరణ్ పై దాడి చేసిన 10 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పోలీసులు ఈ సంఘటన పై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.






యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ మూవీ శక్తి. ఈ మూవీకి ముందు ఇదే కాంబోలో కంత్రి అనే సినిమా వచ్చింది. మెహర్ రమేష్ తెలుగులో దర్శకత్వం వహించిన మొదటి సినిమా కంత్రి. ఈ సినిమాని అశ్వినీదత్ నిర్మించారు. మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బాగానే వసూల్ చేసింది. ఈ సినిమా తరువాత మూడేళ్లకి ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కాంబోలో ‘శక్తి’ సినిమా రూపొందింది.
ఈ చిత్రానికి అశ్వినీదత్ నిర్మాత. ఈ మూవీ రిలీజ్ అయిన తొలి షోతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుని పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వల్ల వచ్చిన నష్టానికి అశ్వినీదత్ నిర్మాణ రంగం విడిచి, విజయవాడకు వెళ్ళిపోవాలని అనుకున్నానని ఒక సందర్భంలో వెల్లడించారు. ఈ మూవీలో ఎన్టీఆర్ తండ్రికొడుకులుగా నటించారు. ఎన్టీఆర్ సీక్రెట్ ఆపరేషన్ లో హోమ్ మినిస్టర్ కుమార్తె ను కాపాడే గైడ్ పాత్రలో కనిపిస్తాడు.
ఒక సీన్ లో హీరోయిన్ ఇలియానాను కొందరు బలవంతంగా తీసుకెళ్తుంటారు. ఆ విషయాన్ని ఆమె ఫ్రెండ్స్ ఎన్టీఆర్ తో చెప్పడంతో ఆమెని కాపాడడం కోసం ఎన్టీఆర్ పారాషూట్ సహాయంతో వెళ్ళి విలన్ పై దుకుతాడు. కానీ ఆ సీన్ లో డూప్ పెట్టడంతో, ఎన్టీఆర్ కి బదులు సీన్ లో డూప్ కనిపిస్తాడు. ఈ మిస్టేక్ ని గమనించిన నెటిజెన్లు చూసుకోవాలి కదా డైరెక్టర్ గారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పల్లెటూరి పొగరుబోతు అమ్మాయి క్యారెక్టర్ అయినా, ఆత్మాభిమానం కల మధ్యతరగతి యువతి క్యారెక్టర్ అయినా, అందం అణుకువ ఉన్న అమ్మాయి అయినా, నవలా నాయికగా నటించాలన్నా అది వాణిశ్రీకి మాత్రమే సాధ్యం అని చెప్పవచ్చు. ఆ అదృష్టం ఆమెకే దక్కింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ సినిమాలతో కలిపి సుమారు 95 సినిమాలలో నటించిన వాణిశ్రీ, ఆ రోజుల్లో అందరికన్నా ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా నిలిచింది.
వాణిశ్రీ అసలు పేరు రత్న కుమారి. 1962 లో భీష్మ తెలుగు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదట్లో కొన్ని సినిమాలలో చిన్న పాత్రలు చేసిన ఆమె. ఆ తరువాత అగ్ర హీరోయిన్ గా ఎదిగారు. ఆమె 40 ఏళ్ల సినీ కెరీర్లో 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, సౌత్ , నంది అవార్డులు మరియు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు. వాణిశ్రీ టాప్ హీరోయిన్ గా ఉన్న టైమ్ లోనే డా. కరుంకరన్ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
1989 లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. కొడుకు పుట్టిన తరువాత థైరాయిడ్ సమస్య ఏర్పడి, వాణిశ్రీ బాగా లావయ్యారని తెలుస్తోంది. తాజాగా తిరుమలకు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారు వాణిశ్రీ ఇలా మారిపోయరేంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుత రోజుల్లో మానవత్వానికి విలువనివ్వడం లేదు. డబ్బుకి, ఆస్తులకు ఇచ్చే విలువలో సగం కూడా కుటుంబ బంధాలకు ఇవ్వడం లేదు. అలా అనడానికి తాజాగా జరిగిన ఒక సంఘటననే ఉదాహరణగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలంలోని గామాలపాడు చెందిన ఏడుకొండలు, వెంకటరత్నమ్మలకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని తమకున్నంతలో పెంచి, పెద్ద చేసి ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. అయితే వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుమారుడు వెంకటేష్ కు వారు భారమయ్యారు.
ఇక ఆస్తి పంపకాలలో వచ్చిన గొడవల వల్ల వెంకటరత్నం పై కొడుకు, కోడలు దాడి చేశారు. దాంతో వెంకటరత్నం చెయ్యి విరిగింది. విషయం బయటికి వస్తుందని కుమారుడు తల్లి పై కాస్త జాలి కూడా లేకుండా నల్గొండ జిల్లా, మిర్యాలగూడలోని ఒక తండాలోని శ్మశానవాటికలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తరువాత అక్కడికి మొక్కలకు నీళ్ళు పోసే పని చేసే గ్రామపంచాయతీ వర్కర్ శ్రీనివాస్ వెళ్లాడు. అక్కడ ఉన్న వెంకటరత్నం చూసి వెంటనే సర్పంచ్ కు తెలియచేశాడు.
దాంతో సర్పంచ్, గ్రామస్తులు వెంకటరత్నం వివరాలు తెలుసుకుని పోలీసులకు తెలిపారు. ఆమె ఇంటికి వెళితే కొడుకు, కోడలు తనను చంపేస్తారని భయాందోళనను వ్యక్తం చేసింది. హాస్పటల్ కి తీసుకు వెళ్లమని కన్నీటితో వేడుకొంది. గాయాలతో బాధపడుతున్న ఆ వృద్ధురాలిని పోలీసులు మిర్యాలగూడ హాస్పటల్ కి తరలించారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి, దాచేపల్లి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.
ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటికే సెమీస్ ఫైనల్ కు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేరుకున్న విషయం తెలిసిందే. భారత్ ఆడిన 8 మ్యాచ్ లలో అన్ని గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండవ స్థానంలో సౌతాఫ్రికా జట్టు 12 పాయింట్లతో ఉంది. ఆస్ట్రేలియా 12 పాయింట్లతో, 0.861 నెట్ రన్ రేట్ తో మూడవ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ శ్రీలంక పై గెలుపుతో పది పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది. సెమీస్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ ఉన్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ ఏదో వండర్ జరిగితే తప్ప సెమీ ఫైనల్ కు వెళ్ళడం అసంభవం.
ఈ క్రమంలో అందరి దృష్టి ఇప్పుడు ఫైనల్ కు వెళ్ళే రెండు జట్లు పై ఉంది. ప్రస్తుతం జట్టుకు ఫామ్ ను బట్టి, బలాబలాలు బట్టి భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకుంటాయని అంటున్నారు. దీంతో 2003 ప్రపంచ కప్ ఫైనల్ రిపీట్ కాబోతుందని అంటున్నారు. ఎందుకంటే ఈ భారత్, ఆస్ట్రేలియా జట్లు మంచి ఫామ్‌లో ఉన్నాయి. 2003 ప్రపంచ కప్‌లో కూడా భారత్, ఆస్ట్రేలియా జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా మంచి ఫామ్ లో ఉన్నా, లీగ్ దశలో రెండు తడబడటం కనిపించింది.
భారత్ తడబాటు లేకుండానే సెమీస్ కు చేరుకుంది. ఆసీస్ మొదట్లో తడబడినప్పటికీ ఏమాత్రం వెనక్కు వెళ్ళలేదు. ఇక ఈ టోర్నీలో సౌతాఫ్రికా తడబడటం తెలిసిందే. అందువల్ల ఆస్ట్రేలియా రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను ఓడిస్తుందని అనుకుంటున్నారు. అలా జరిగితే భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరుగుతుంది. ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓటమి పలు చేసి భారత్ ప్రపంచ కప్ ను అందుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

