కన్నతల్లి అని కూడా చూడకుండా బతికుండగానే స్మశానంలో వదిలి వెళ్ళిపోయాడు..! కానీ తర్వాత ఏం జరిగిందంటే..?

కన్నతల్లి అని కూడా చూడకుండా బతికుండగానే స్మశానంలో వదిలి వెళ్ళిపోయాడు..! కానీ తర్వాత ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

సమాజంలో రోజు రోజుకీ మానవత్వం నశించిపోతుంది. దానికి నిదర్శణంగా పలు సంఘటనలు తరచూ వార్తల్లో  వస్తూనే ఉన్నాయి. అలాంటి సంఘటనలు విన్నప్పుడు లేదా చూసినపుడు పిల్లలను కన్న తల్లిదండ్రులను ఆందోళనకు గురిఅవుతూ ఉంటారు.

Video Advertisement

ముసలితనంలో తల్లిదండ్రులకు తోడుగా ఉండి, వారి మంచి చెడ్డ చూసుకోవాల్సిన బిడ్డలే వారిని భారంగా చూస్తున్నారు. కొందరు బిడ్డలు వృద్ధులైన తమ తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్ లకు పంపిస్తుంటే, మరి కొందరు కాస్త కూడా దయ చూపకుండా వారిని రోడ్లపైన అనాధలుగా వదిలేస్తున్నారు. తాజగా ఒక కొడుకు బ్రతికి ఉన్న కన్నతల్లిని స్మశానంలో విడిచిపెట్టాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుత రోజుల్లో మానవత్వానికి విలువనివ్వడం లేదు. డబ్బుకి, ఆస్తులకు ఇచ్చే విలువలో సగం కూడా కుటుంబ బంధాలకు ఇవ్వడం లేదు. అలా అనడానికి తాజాగా జరిగిన ఒక సంఘటననే ఉదాహరణగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలంలోని గామాలపాడు చెందిన ఏడుకొండలు, వెంకటరత్నమ్మలకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని తమకున్నంతలో పెంచి, పెద్ద చేసి ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. అయితే వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుమారుడు వెంకటేష్ కు వారు భారమయ్యారు.
ఇక ఆస్తి పంపకాలలో వచ్చిన గొడవల వల్ల వెంకటరత్నం పై కొడుకు, కోడలు దాడి చేశారు. దాంతో వెంకటరత్నం చెయ్యి విరిగింది. విషయం బయటికి వస్తుందని కుమారుడు తల్లి పై కాస్త జాలి కూడా లేకుండా నల్గొండ జిల్లా, మిర్యాలగూడలోని ఒక తండాలోని శ్మశానవాటికలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తరువాత అక్కడికి మొక్కలకు నీళ్ళు పోసే పని చేసే గ్రామపంచాయతీ వర్కర్ శ్రీనివాస్ వెళ్లాడు. అక్కడ ఉన్న వెంకటరత్నం చూసి వెంటనే సర్పంచ్ కు తెలియచేశాడు.
దాంతో సర్పంచ్,  గ్రామస్తులు వెంకటరత్నం వివరాలు తెలుసుకుని పోలీసులకు తెలిపారు. ఆమె ఇంటికి వెళితే కొడుకు, కోడలు తనను చంపేస్తారని భయాందోళనను వ్యక్తం చేసింది. హాస్పటల్ కి తీసుకు వెళ్లమని కన్నీటితో  వేడుకొంది. గాయాలతో బాధపడుతున్న ఆ వృద్ధురాలిని పోలీసులు మిర్యాలగూడ హాస్పటల్ కి తరలించారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి, దాచేపల్లి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.

Also Read: అసలు కారణం ఇదేనా..? విజయవాడ బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ ఏం అన్నారంటే..?

 


End of Article

You may also like