ఐసీసీ ప్రపంచకప్ 2023 చివరి దశకు చేరుకుంది. మూడు లీగ్ మ్యాచులు మాత్రమే ఉన్నాయి. ఆ మ్యాచ్ ల తర్వాత నాకౌట్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. అసలు కిక్ మొదలయ్యేది అప్పుడే అనే విషయం తెలిసిందే. లీగ్ దశలో ఓడినపుడు మరో అవకాశం ఉంటుంది. అయితే నాకౌట్ లో ఓడిన జట్టు మాత్రం ఇంటికి వెళ్ళాల్సిందే.

Video Advertisement

ఈ టోర్నీలో భారత జట్టు అద్భుతంగా ఆడి, సెమీస్ కు దూసుకెళ్లింది. అయితే, టీమిండియాకు సెమీఫైనల్ మ్యాచులు పెద్దగా కలిసి రావు. 2011 లో కప్ గెలిచిన తరువాత సెమీస్ గండాన్ని దాటలేకపోయింది. ఈసారి మాత్రం టీమిండియా అతి పెద్ద బలం ఈ గండాన్ని దాటి, కప్ ను సాధిస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
వన్డే వరల్డ్ కప్ 2023 భారత జట్టు ఇప్పటి వరుకు ఆడిన 8 మ్యాచుల్లో, 8 విజయాలు సాధించి, సెమీస్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా 2015, 2019 ప్రపంచ కప్ టోర్నీలలో సెమీస్ ను దాటలేకపోయింది. ఈసారి జట్టు అద్భుతంగా రాణిస్తుండడంతో ఆ గండాన్ని దాటుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జట్టుకు అండగా అతి పెద్ద బలంగా రోహిత్ శర్మ ఉండడం వల్ల సెమీస్ గండాన్ని దాటి, కప్ ను అందుకుంటారని అభిమానులు అనుకుంటున్నారు.టీమిండియా సారధి రోహిత్ శర్మ సెంచరీలు, సెంచరీలు చేయకపోయినా, ఓపెనర్ గా ఆరంభంలోనే తన దూకుడు బ్యాటింగ్ తో ప్రత్యర్ధి జట్టును డిఫెన్స్ లో పడేశాడు. ఆస్ట్రేలియాతో ఆడిన మొదటి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ మొదట్లోనే అవుట్ అయినా, ఆ తరువాత మ్యాచ్ లలో ఇన్నింగ్స్ మొదటి నుండే ఫోర్లు, సిక్సర్లతో అవతలి జట్టుకు చుక్కలు చూపించాడు. అవుట్ అయ్యేలోపు  భారత జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తూ, గెలుపుకు పునాది వేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అర్ధ సెంచరీలు, సెంచరీ చేయలేకపోతున్నాడు.
వ్యక్తిగత రికార్డులకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా, రోహిత్ శర్మ టీమిండియా కోసమే ఆడుతున్నాడు. 8 మ్యాచుల్లో 442 రన్స్ చేశాడు. అవి కూడా వందకి పైన స్టైక్ రేట్ తో, ఇదే అతని ఆటను తెలియయచేస్తుంది. సారధ్యం విషయంలో సైతం రోహిత్ శర్మ తన మార్కును  చూపిస్తున్నాడు. రోహిత్ శర్మ ప్రపంచ కప్ 2023 టోర్నీలో  ఫీల్డ్ సెట్టింగ్, బౌలర్లను ఉపయోగించుకున్న విధానం, డీఆర్ఎస్ వాడిన తీరు హైలెట్ గా అనవచ్చు. ఇలా ఆరంభ ఇన్నింగ్స్ మరియు  కెప్టెన్సీ తో టీమిండియా రోహిత్ శర్మ అతి పెద్ద బలంగా మారాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Also Read: ప్రపంచ కప్ ఫైనల్ 2023 కి చేరేది 2 జట్లు ఇవేనా..? ఇందులో ఎంత వరకు నిజం అవుతుంది..?