ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో ‘ బిగ్ బాస్’ గా పాపులరిటిని సొంతం చేసుకుంది. ఈ రియాలిటీ షో అన్ని భాషలలోనూ టెలికాస్ట్ అవుతూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. తెలుగులో ఇప్పటివరకు 6 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 6వ సీజన్ ఫ్లాప్ అయిన సంగతి అందరికి తెలిసిందే.
బిగ్ బాస్ ఏడవ సీజన్ ను సక్సెస్ చేయడం కోసం మేకర్స్ పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షో ఇప్పటికే టెలికాస్ట్ కావాల్సింది. కానీ ఆలస్యం అవుతూనే ఉంది. బిగ్ బాస్ ఏడవ సీజన్ కోసం కంటెస్టెంట్ల సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి అయిందని తెలుస్తోంది.
ఏడవ సీజన్ లో భాగంగా సరికొత్త టాస్కులను పోటీదారులకు ఇస్తారని సమాచారం. ఈసారి కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి, పాపులర్ అయిన సెలెబ్రెటీలను బిగ్ బాస్ ఏడవ సీజన్ కు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోకు ఈసారి కొత్త దంపతులతో పాటుగా డైవర్స్ తీసుకున్న సినీ సెలబ్రిటీలను తీసుకువస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా ఏడవ సీజన్ కు హోస్ట్ గా అక్కినేని నాగార్జున కాకుండా హీరో రానా దగ్గుబాటి వ్యవహరిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో తెలుగు బిగ్ బాస్ 7 లో పాల్గొనే పోటీదారులు వీళ్లే అంటూ ఒక లిస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే..
1. అమర్ దీప్- జానకి కలగనలేదు సీరియల్ నటుడు.
2. తేజస్విని – సీరియల్ హీరోయిన్.
3. మంగ్లీ- సింగర్.
4. మోహన భోగరాజు- సింగర్.
5.హేమచంద్ర – సింగర్.
6. సాకేత్ కొమండూరి – సింగర్.
7. దీపిక పిల్లి – యాంకర్.
8. రష్మీ – యాంకర్.
9. విష్ణు ప్రియ – యాంకర్.
10. మహేష్ బాబు కాళిదాసు – టీవి నటుడు.
11. సిద్దార్థ్ వర్మ – టీవి నటుడు.
12. నిఖిల్ విజయేంద్ర సిన్హా – యూట్యూబర్
13. ఐశ్వర్య – సీరియల్ హీరోయిన్.
14. శోభా శెట్టి – సీరియల్ హీరోయిన్.
15. మిత్రా శర్మ – సీరియల్ హీరోయిన్.
16. ఈటీవీ ప్రభాకర్ – టీవి నటుడు.
17. పండు – కొరియోగ్రాఫర్
18. జబర్దస్త్ అప్పారావు – జబర్దస్త్ షో కమెడియన్.
19. ప్రత్యూష – న్యూస్ రీడర్.
20. సాయి రోనాక్ – మోడల్.
21. పల్లవి ప్రశాంత్- కామన్ మ్యాన్ క్యాటగిరి
22. నోయెల్- ర్యాప్ సింగర్, నటుడు.
23. ఎస్తేర్- సినీనటి, నోయెల్ మాజీ భార్య.
Also Read: “రాకేష్ మాస్టర్” తండ్రి ఎంత గొప్పవారో తెలుసా..? అప్పట్లోనే ఇంత ఆలోచించారా..?

ఇటీవల జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టును నడిపించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు. ప్రధానంగా అశ్విన్ విషయంలో మిస్టేక్ చేశాడు. భారత జట్టు ద్వైపాక్షిక ఈవెంట్స్ లో గెలిచినప్పటికీ, ఐసీసీ ట్రోఫీ విషయంలో మాత్రం విజయం సాధించలేకపోతుంది. చెప్పాలంటే ధోని వంటి కెప్టెన్ భారత జట్టు మళ్లీ దొరకలేదని చెప్పవచ్చు. ఇక ఈ నెలలో జరిగిన డబ్య్లూటీసీ ఫైనల్లో భారత జట్టు ఓటమి కెప్టెన్ గా రోహిత్ శర్మ భవితవ్యం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇండియా మాజీ సెలెక్టర్ భూపిందర్ సింగ్ సీనియర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనిని కెప్టెన్‌గా ఎందుకు నియమించారో వెల్లడించాడు. ‘కెప్టెన్ ను జట్టు నుండి డైరెక్ట్ గా ఎన్నుకోకుండా, ఆ వ్యక్తి బాడీ లాంగ్వేజ్, టీమ్ ను ముందుండి నడిపించగలిగే లక్షణం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఇతర ప్లేయర్స్ తో మాట్లాడే విధానం, వంటి విషయాల్లో నైపుణ్యాలను బట్టి కెప్టెన్‌గా ఎన్నుకుంటారు. అలాంటి లక్షణాలను ధోని కెప్టెన్ కాకముందే చాలా సార్లు కనబర్చాడు. ఆ విషయంలో మాకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది’ అని తెలిపారు.
రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్. రామారావు అని అంటున్నారు. కానీ ఆయన అసలు పేరు రామిరెడ్డి అని, నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలంలోని జమ్మిపాడు ఆయన స్వస్థలమని రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ చిట్టిబాబు తెలిపారు. రాకేష్ మాస్టర్ తండ్రి పేరు బాలిరెడ్డి. ఆయన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి . కమ్యూనిస్ట్ లీడర్ పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు బాలిరెడ్డి ఆయనకు అనుచరుడుగా ఉన్నారు. కుల వివక్ష ఉండకూదని సుందరయ్య తన పేరులోని రెడ్డిని తొలగించుకున్నారు.
దాంతో బాలిరెడ్డి తన పేరులోని రెడ్డిని, తన కుమారుడు రాకేష్ మాస్టర్ పేరులోని రెడ్డిని కూడా తొలగించారట. అలా రామిరెడ్డి రామారావుగా మారింది. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత రాకేష్ మాస్టర్ గా మారింది. రాకేష్ మాస్టర్ స్వస్థలం చాలామంది తిరుపతి అనుకుంటున్నారు. బాలిరెడ్డికి తిరుపతి మార్కెట్ యార్డులో జాబ్ రావడంతో ఫ్యామిలీతో నెల్లూరు నుండి తిరుపతికి వెళ్లారు. రాకేష్ మాస్టర్ అక్కడే డాన్స్ స్కూల్ ను మొదలుపెట్టారు. సినిమాలలో ఛాన్స్ కోసం మద్రాసు వెళ్లారు. అక్కడ చాలా మంది డాన్స్ మాస్టర్ల వద్ద అసిస్టెంట్ గా చేశారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది కొరియోగ్రాఫర్లకు రాకేష్ మాస్టర్ గురువు. తర్వాత హైదరాబాద్ కి వచ్చి పలు టెలివిజన్ డాన్స్ షోలలో పాల్గొన్నారు. ఆ తరవాత ఇండస్ట్రీలో అడుగు పెట్టి, దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా చేశారు. రాకేష్ మాస్టర్ మద్యానికి అలవాటుపడి, తాగిన మైకంలో మూర్ఖంగా మాట్లాడేవారని, ఈ ప్రవర్తనే ఆయనను సినీ పరిశ్రమకు దూరం చేసిందని సన్నిహితులు చెబుతున్నారు.
ఇక రాకేష్ మాస్టర్ పర్సనల్ లైఫ్ విషయనికి వస్తే, ఆయన ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య విద్యావంతురాలని, ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా చేస్తున్నారని ఆలేటి ఆటమ్ అన్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కానీ రాకేష్ మాస్టర్ ప్రవర్తన వల్ల భార్యకు దూరమయ్యారు. ఆ తరవాత రెండవ వివాహం చేసుకున్నారు. ఇటీవల మరో అమ్మాయితో సహజీవనం చేశారు.
సునీల్ లహరి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కించామని డిస్క్లెయిమర్లో క్లియర్ గా చెప్పారు. రామాయణంలో ఇలాంటి డైలాగ్స్ ఉపయోగించడం సిగ్గు చేటు అని అన్నారు. రావణుడిని పుష్పక విమానంతో చూపించలేదని, లక్ష్మణుడు, మేఘనాథ్ యుద్ధాన్ని నీటిలో చూపించారని’ అన్నారు.
‘ఏ పాత్రకు కూడా క్యారెక్టరైజేషన్ స్పష్టంగా లేదు. డైరెక్టర్ ఈ చిత్రం ఎందుకు తీశాడో, విఎఫ్ఎక్స్తో మూవీని నిలబెట్టలేరు. రామాయణాన్ని సింపుల్‌గా చెప్పాలి. హనుమంతుడితో అలాంటి సంభాషణలు ఎలా చెప్పించారో అర్థం కావట్లేదు’ అని అన్నారు. ఆదిపురుష్ సినిమాలోని క్యారెక్టర్లను చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. రావణుడు చాలా అందమైన దేశానికి రాజు. ఈ మూవీలో అలా ఎందుకు చూపించారో, నకిలీ సీతను చూపించాల్సిన అవసరం ఏం వచ్చిందని అన్నారు.
‘మూవీలో స్టోరీని సరళంగా చెప్తే, పరిస్థితి వేరేలా ఉండేది. ఈ మూవీలోని పాత్రలన్ని అయోమయంగా ఉన్నాయని, ఇది నటినటుల మిస్టేక్ కాదు. పాత్రలు స్పష్టంగా లేకపోవడం వల్ల అలా జరిగింది. డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రం తెరకెక్కించడంలో ఇంకాస్త తెలివిగా వ్యవహరించాల్సింది.’ అని సునీల్ లహరి అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, హనుమంతుడిగా దేవదత్తా నాగే నటించారు.
దంగల్, చిచోరే వంటి బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు నితేశ్ తివారి రామాయణం తెరకెక్కిస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, సీతగా అలియా భట్ నటిస్తున్నారని ప్రకటించారు. మిగతా పాత్రల కోసం దక్షిణాది నటినటులను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్ ని నితీశ్ తివారి తెరకెక్కించే రామాయణం గురించి అడిగారు. ఓం రౌత్ ఇలా చెప్పుకొచ్చాడు. నితేశ్ తివారి గ్రేట్ డైరెక్టర్. తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు. నితీశ్ తివారి తీసిన దంగల్ మూవీ భారతీయ అత్యుత్తమ సినిమాలలో ఒకటి అన్నారు.
నితేశ్ తివారి రచనలు, డైరెక్షన్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. నితేశ్ తీయబోయే రామాయణం పై రామ భక్తుల అందరిలాగే తాను కూడా ఆ మూవీ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. శ్రీ రాముడి గురించి ఎవరైనా, ఎన్ని చిత్రాలయినా రూపొందించవచ్చు. శ్రీ రాముడి గాధను ఎంత ఎక్కువ మంది చెప్తే అంత మంచిదని అన్నారు.
ఆదిపురుష్ సినిమాను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ పీఎం మోదీకి లేఖ రాశారు. అందులో ఈ సినిమా ప్రదర్శనను థియేటర్లు మరియు ఓటీటీలో బ్యాన్ చేసేట్టు ఆదేశించాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ మోదీని అభ్యర్థించింది. ఆదిపురుష్ మూవీ దర్శకుడు ఓం రౌత్, రైటర్ మనోజ్ శుక్లా పై వెంటనే పై కేసు నమోదు చేయాలని కోరింది.
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాముడు, హనుమంతుడి గౌరవాన్ని పోగొట్టేలా ఉన్నాయని పేర్కొంది. శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, రావణుడి క్యారెక్టర్లను మలిచిన విధానం బాగాలేదని పేర్కొన్నారు. భారతీయ ఇతిహాసమైన రామాయణం పేరుని చెడగొట్టేలా ఆదిపురుష్ ఉందని, మూవీలోని డైలాగ్‌లు హిందూవుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అన్నారు.
భారతదేశంలో శ్రీరాముడిని దేవుడిలా ఆరాధిస్తారని, కానీ ఆదిపురుష్ మూవీలో రాముడిని, రావణాసురుడిని వీడియో గేమ్స్‌లోని క్యారెక్టర్లలా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఇలాంటి మూవీలో హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్, సైఫ్ అలీఖాన్ లు భాగస్వామ్యం అవడం సిగ్గుచేటని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖలో పేర్కొన్నారు.
ఆస్ట్రాలజర్ వేణుస్వామి గురించి అందరికి తెలిసందే. జ్యోతిష్య వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయి. వేణుస్వామి ఇటీవల ఆదిపురుష్ సినిమా గురించి చెప్పారు. ఆదిపురుష్ సినిమా పై వస్తున్న ట్రోల్స్, విమర్శల నేపథ్యంలో వేణుస్వామి చెప్పిందే జరుగుతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ మూవీకి ఇప్పటివరకు హిట్ టాక్ రాలేదు. రివ్యూలు కూడా ఆదిపురుష్ హిట్ అని, ఫ్లాప్ అని చెప్పలేకపోయాయి.
వేణుస్వామి ‘ఆదిపురుష్’ రిలీజ్ కు ముందే అందరు అనుకున్నట్లుగా ఈ సినిమా హిట్ కాదని, యావరేజ్ గా నిలుస్తుందని జోస్యం చెప్పారు. బాహుబలి అంత ఊహించుకోవాల్సిన పని లేదన్నారు. రామాయణం ఆధారంగా వస్తున్న సినిమా అయినా ఆదిపురుష్ మాత్రం అంతగా హిట్ కాదని అన్నారు. హీరో ప్రభాస్ జాతకాన్ని బట్టి ఫలితం ఉందన్నారు.
విజువల్ వండర్ గా రూపొందించడంలో ఆదిపురుష్ మూవీ యూనిట్ సక్సెస్ అవలేదని, ప్రభాస్ ఇచ్చిన ఛాన్స్ ని డైరెక్టర్ ఓంరౌత్ సరిగా వినియోగించుకోలేదని, రామాయాణం స్టోరి విషయంలో సినిమాటిక్ ఫ్రీడంను ఎక్కువగా తీసుకున్నాడని అంటున్నారు. అందువల్లనే ఆడియెన్స్ పూర్తిగా ఈ మూవీ ఆమోదించడంలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక వేణుస్వామి చెప్పినట్టుగానే ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది.
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమాకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ గ్లింప్స్ కు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం తమన్ ను ఈ మూవీ నుండి తప్పించారని ప్రచారం జరిగింది. ఆ తరువాత రిలీజ్ అయిన గ్లింప్స్ తో అవన్నీ రూమర్స్ అని తేలింది. అయితే, తాజాగా తమన్ ను గుంటూరు కారం నుంచి తొలగించారనే ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుండి పూజా హెగ్డే తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్ ను తొలగించినట్లుగా వస్తున్న వార్తలలో వాస్తవం లేదని తెలుస్తోంది. వైజే రాంబాబు అనే ఎడిటర్ ఈ విషయం పై క్లారిటీ ఇస్తూ “మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తమన్ ని తప్పిస్తున్నారు అనే మాట అవాస్తవం. ఈ నెల 24 నుంచి షూటింగ్, జనవరి 13న రిలీజ్. ఒకవేళ అదే రోజు ప్రభాస్ ప్రాజెక్ట్ K ఉంటే మాత్రం ఒక రోజు ముందుగానే రిలీజ్” అని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కి ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా రెస్పాండ్ అయ్యారు.
మరో వైపు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ట్వీట్ చేశాడు. తన ట్విట్టర్ అకౌంట్ లో మజ్జిగ గ్లాస్ ఇమేజ్ ను షేర్ చేసి, “రేపటి నుండి నా స్టూడియోలో ఫ్రీగా మజ్జిగ స్టాల్స్‌ను మొదలుపెడుతున్నాను. కడుపు మంట లక్షణాలతో ఇబ్బందీపడేవారికి స్వాగతం. నా టైమ్ ని వెస్ట్ చేయకూడదని భావిస్తున్నాను” అని రాసుకొచ్చాడు. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో తమన్ ను తొలగించారనే వార్తలు రూమర్స్ అని తేలింది. హీరోయిన్ పూజా హెగ్డే విషయం తెలియాల్సి ఉంది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆడియెన్స్ మనసులను హత్తుకుంది. ఈ చిత్రంలో సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు తమ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించారు. జక్కన్న 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, తెలుగు సినిమా ఖ్యాతిని వరల్డ్ వైడ్ గా చాటి చెప్పింది. ఈ సినిమాను చూసి హాలీవుడ్ సినీ సెలెబ్రెటీలు కూడా జక్కన్న దర్శక ప్రతిభకు మెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ లో కూడా పలు అవార్డులను అందుకుంది
సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన ఆస్కార్ అవార్డుని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ అందుకుంది. నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ ను ఉరూతలూగించింది. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ పనిచేశారు. చిన్న,పెద్ద తేడా లేకుండా అందరు నాటు నాటు సాంగ్ కు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ గురించి ప్రస్తుతం ఒక విషయం వైరల్ గా మారింది.
నాటు నాటు పాటలోని పాపులర్ స్టెప్స్ ని కోలీవుడ్ స్టార్ హీరో మూవీ నుండి కాపీ చేశారని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ స్టార్ హీరో ఎవరంటే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి. విజయ్ 1996లో ‘కోయంబత్తూరు మాపిళ్ళై’ అనే సినిమాలో నటించారు. హీరోయిన్ గా సంఘవి నటించారు. ఇక ఆ సినిమాలో ఒక పాటలో విజయ్ చేసిన స్టెప్స్, జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన స్టెప్స్ ఒకేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.