నేర చరిత్ర కలిగిన ఒక వ్యక్తి రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకొని తన చర్మం వలచి తల్లికి చెప్పులు కుట్టించిన ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. నేటి పిల్లలు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలోకి నెట్టి బాధ్యతను వదిలించుకుందాం అనుకుంటున్న యుగం ఇది. అయితే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో నగరంలోని ధంచా భవన్ ప్రాంతంలో నివసించే రౌనక్ గుర్జార్ పేరు మోసిన రౌడీ షీటర్.ఇతను ఉజ్జయిని నగరంలో బీభత్సం సృష్టించాడు.
ఒక వివాదంలో మోంటు గుర్జార్ అనే వ్యక్తిని కాల్చి చంపారు, పారిపోయిన దుండగులు నగరంలోని కృపా రెస్టారెంట్ యజమాని నుండి విమోచన క్రయధనంగా 50 వేలు డిమాండ్ చేశారు. అయితే అతను డిమాండ్ చేసిన ధనాన్ని చెల్లించకపోవడంతో అతనిని కూడా కాల్చి చంపారు. అంతేకాదు రైల్వేస్టేషన్ సమీపంలో స్వప్న స్వీట్స్ మేనేజర్ నుంచి 5 లక్షల రూపాయలు విమోచన క్రయ ధనం కూడా డిమాండ్ చేశారు. సదరు యజమాని డబ్బులు ఇవ్వకపోవడంతో అతనిని కూడా కాల్చి చంపారు.
ఈ వివాదాలలో ఒకసారి రౌనక్ గుర్జార్ కూడా ఒకసారి పోలీసులు జరిపిన కాల్పులలో తీవ్రంగా గాయపడ్డాడు. అలాంటి సమయంలో అతను రామాయణం చదవటం జరిగింది. రామాయణంలో శ్రీరామచంద్రుడు తల్లికి చర్మంతో చెప్పులు కుట్టించినా తక్కువే అని స్వయంగా చెప్పటం అతనిని ప్రభావితం చేసింది. వెంటనే తన మనసులోకి ఒక ఆలోచన వచ్చింది.
వెంటనే కుటుంబంలో ఎవరికీ తెలియకుండా రౌనక్ ఆసుపత్రిలో రహస్యంగా శాస్త్ర చికిత్స చేయించుకుని చీలమండపై చర్మాన్ని తొలగించి చెప్పులు కుట్టే వ్యక్తి చేత చెప్పులు తయారు చేయించాడు. అతను తన ఇంట్లో జరిగిన మతపరమైన వేడుకలలో ఈ చెప్పులను తన తల్లికి బహుమతిగా ఇచ్చాడు. చెప్పులు బహుమతిగా అందుకున్న ఆ తల్లి కన్నీటి పర్యంతం అయింది. అతని చర్మంతో నాకు చెప్పులు కుట్టిస్తాడని ఊహించలేదు. ఇలాంటి కొడుకుని కనడం నా అదృష్టం గా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది ఆ తల్లి.