ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు ఉండే క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే హీరోయిన్లకే కాకుండా సినిమాలలో సహయ పాత్రలు చేసిన నటిమణులకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా హీరో సిస్టర్ పాత్రలో నటించి మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తారల ఎంతోమంది ఉన్నారు.
అలాంటి పాత్రలు చేసి, గుర్తింపు తెచ్చుకున్నవారిలో సంజన సారథి కూడా ఒకరు. అయితే సంజన సారథి అంటే గుర్తుపట్టలేరు. కానీ తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సిస్టర్ అనగానే ఈజీగా గుర్తుపడతారు. ఆమె గురించి ఇప్పుడు చూద్దాం..
విజయ్ దళపతి హీరోగా నటించిన తుపాకీ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో విజయ్ రెండవ చెల్లిగా సంజనా సారథి నటించింది. తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు గాను ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ రావడంతో పలు సినిమాలలో కీలకపాత్రలు చేసి ఆడియెన్స్ దగ్గరయ్యింది.
సంజన సారథి 2012లో బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన ‘వజక్కు ఎన్ 18/9’ సినిమాతో ఇండస్ట్రీలో అడగుపెట్టింది. ఆ తర్వాత ఎనై నోకి పాయుమ్ తోట, ఎండ్రెండ్రుమ్ పున్నగై, వాలు, బ్రో సినిమాలో నటించింది. టైమ్ ఎన్నా బాస్, ఫింగర్టిప్, లటి వెబ్ సిరీస్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘సరసాలు చాలు’ అనే మూవీతో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పెద్దగా మెప్పించకపోవడంతో ఆమెకు గుర్తింపు దక్కలేదు. దాంతో మళ్ళీ కోలీవుడ్ కు వెళ్ళిపోయింది.
ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. లేటేస్ట్ ఫోటోస్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని పలకరిస్తుంది. తాజాగా జిమ్ వర్కవుట్ ఫోటోను సంజన షేర్ చేయగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకప్పుడు విజయ్ సిస్టర్ గా కనిపించిన అమ్మాయి, ప్రస్తుతం హీరోయిన్ లా ఉందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: “బాలకృష్ణ” కి అప్పుడు హీరోయిన్గా, ఇప్పుడు తల్లిగా నటించిన… ఒకే ఒక్క నటి ఎవరో తెలుసా..?









సాధారణంగా సినిమాలో స్టార్ హీరోతో పాటు మరో స్టార్ హీరో కనిపిస్తేనే భారీగా అంచనాలు ఏర్పడతాయి. తమ అభిమాన హీరో మరో హీరో మూవీలో అతిథి పాత్రలో కనిపించాడంటే ఆ హీరో ఫ్యాన్స్ చేసే హడావుడి మామూలుగా ఉండదు. టాలీవుడ్ లో మల్టీస్టారర్లు ఇప్పుడు కొత్త కాదు. సీనియర్ ఎన్టీఆర్-ఏఎన్నార్ నుంచి జూనియర్ ఎన్టీఆర్- రామ్చరణ్ వరకు అడపాదడపా మల్టీస్టారర్ చిత్రాలు ఆడియెన్స్ అలరిస్తున్నాయి.
అయితే 1987 లో అతిపెద్ద మల్టీస్టారర్ వచ్చింది. కానీ సినిమా అంతా మల్టీస్టారర్ కాదు. ఒక సాంగ్ వరకు మాత్రమే. 1987లో వెంకటేశ్ హీరోగా నటించిన ‘త్రిమూర్తులు’ మూవీలో ‘ఒకే మాట ఒకే బాట’ అనే సాంగ్ లో అప్పటి స్టార్ హీరోలు, హీరోయిన్లు సందడి చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, తదితర హీరోలు కనిపించారు. ఇక ఈ హీరోలతో పాటు అప్పటి టాప్ హీరోయిన్లు రాధిక, విజయశాంతి, రాధ, భానుప్రియ, సుమలత వంటి హీరోయిన్లు కనిపించారు.
వీరితో పాటు చంద్రమోహన్, మురళీమోహన్, కోడి రామకృష్ణ, విజయనిర్మల, శారద, జయమాలిని వంటి యాక్టర్స్ కూడా ఈ పాటలో తళుక్కున మెరిసి అభిమానులని అలరించారు. ప్రస్తుతం ఈ క్రేజీ మల్టీస్టారర్ సాంగ్ కి సంబంధించిన వీడియో క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.















2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.

