సినిమా ఫిల్డ్‌లో వారసుల విషయానికి వస్తే హీరోల కొడుకులు హీరోలుగా పరిచయమైన వాళ్ల సంఖ్యే ఎక్కువ. కాని హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా పరిచయం అయిన వాళ్లు తక్కువనే చెప్పాలి.
పెద్ద బాక్గ్రౌండ్ ఉన్న హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎవరూ పెద్దగా సక్సెస్ కాలేదు. హీరోయిన్ అవ్వాలంటే అందం ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా కావాలి. కానీ అందం, అభినయం, అదృష్టం ఉండి కూడా హీరోయిన్లు గా రాణించలేకపోయారు కొందరు. ఇప్పుడు వారెవరో తెలుసుకుందాం..
#1 సుప్రియ యార్లగడ్డ
అక్కినేని నాగేశ్వర రావు గారి మనవరాలు, నాగార్జున మేనకోడలు సుప్రియ. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం తో హీరోయిన్ గా తెరకు పరిచయమయ్యారు సుప్రియ. ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు రాలేదు. తర్వాత ఆమె నిర్మాతగా మారారు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత గూఢచారి చిత్రం లో నటించారు.

#2 మంచు లక్ష్మి ప్రసన్న
మంచు మోహన్ బాబు కుమార్తె గా మంచు లక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈమె హీరోయిన్ గా కాకుండా.. విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ సాగుతోంది కానీ పూర్తి స్థాయి లో పాత్రలు చేయలేకపోతోంది. ఈమె నిర్మాతగా కూడా రాణిస్తున్నారు.

#3 మంజుల ఘట్టమనేని
కృష్ణ రెండో కుమార్తె మంజుల ప్రధాన పాత్రలో ఒకటి రెండు చిత్రాలు వచ్చినా.. కృష్ణ ప్రేక్షకులు దీనికి ఒప్పుకోకపోవడం తో ఆమె హీరోయిన్ గా చెయ్యలేదు.

#4 శృతి హాసన్
కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఉంది.. కానీ కెరీర్ స్టార్టింగ్ లో ఆమెకు అన్ని ప్లాప్ లే..

#5 కొణిదెల నిహారిక
నాగబాబు కుమార్తె హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. దీంతో ఆమె నిర్మాతగా మారారు.

#6 అక్షర హాసన్
కమల్ చిన్న కుమార్తె అక్షర హాసన్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు కానీ.. అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

#7 వరలక్ష్మి శరత్ కుమార్
నటుడు శరత్ కుమార్ ముద్దుల తనయ వరలక్ష్మి కూడా హీరోయిన్ గా సత్తా చాటాలని చూసిన కొన్ని సినిమాల తర్వాత ఎందుకో హీరోయిన్ గా రాణించలేకపోయింది.

#8 శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్
హీరో రాజశేఖర్ కుమార్తెలిద్దరు హీరోయిన్లు గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు . నటులుగా తమని తాము నిరూపించుకున్నారు కానీ వీరిద్దరికి ఇప్పటివరకు బ్రేక్ రాలేదు.


డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి చేరువైన మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’లో విలన్ గా నటిస్తున్నారు. ఆయన నటించిన జనగణమన మూవీ 2022లో థియేటర్లలో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. ఈ మూవీలో సూరజ్ వెంజారమూడు, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలలో నటించారు.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, లెక్చరర్ సభా మరియం (మమతా మోహన్ దాస్)ను అత్యాచారం చేసి, ఆమె బాడీని కాల్చి రోడ్డు పక్కన పడేశారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆమె పనిచేసిన యూనివర్సిటీ విద్యార్ధులు తమ లెక్చరర్ కు న్యాయం చేయాలని ఆందోళనకు దిగుతారు. సభా మరియం తల్లి న్యాయం కోసం పోరాటం ప్రారంభిస్తుంది. ఈ కేసును చేధించేందుకు ఏసీపీ సజ్జన్(సూరజ్ వెంజనమూడు) వస్తాడు. ఆ క్రమంలో ప్రత్యక్షసాక్షి చెప్పిన సాక్ష్యంతో నలుగురు నిందితులను పట్టుకుంటాడు.
సొసైటీ నుండి నిందితులను చంపేయాలనే డిమాండ్ వస్తుంది. పై నుంచి ప్రెజర్ ఎక్కువ అవడంతో ఏసీపీ సజ్జన్ వారిని మరో స్టేషన్ కు తరిలించే టైమ్ లో నిందితులను ఎన్ కౌంటర్ చేస్తాడు. అయితే ఈ ఎన్ కౌంటర్ పై హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేసు పెడుతుంది. ఈ కేసులో లాయర్ అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఏసీపీ సజ్జన్ కు వ్యతిరేకంగా కేసు వాదిస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? అసలు అరవిందన్ ఎవరు? ఎందుకు ఎన్ కౌంటర్ చేశారు? సభా మరియం ఎలా చనిపోయింది? అనేది మిగిలిన కథ.
జన గణ మన మూవీలో ఎన్ని పాత్రలున్నప్పటికీ ప్రధమార్ధంలో ఏసీపీ సజ్జన్, ద్వితీయార్థం అంతా పృథ్వీరాజ్ తమ నటనతో ఆడియెన్స్ ని కట్టిపడేస్తారు. సభా మరియంగా మమతా మోహన్ దాస్ బాగా నటించింది. రోజూ చూసే వార్తల్లోని మరో యాంగిల్ ను ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు డిజో జోస్ ఆంటోని తెరకెక్కించారు.
ఇక ఆ ఊరిలోకి వేరే ఊరి వారు వస్తే వచ్చిన వాళ్లను వచ్చినట్టే దొర చంపేస్తూంటాడు.ఈ క్రమంలో ఆ గూడెంలోని ఒక పిల్లాడికి రేడియో దొరుకుతుంది.రేడియో అంటే ఏమిటో,ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అయితే ఆ రేడియో వల్ల గూడెంలో అల్లకల్లోలం జరిగి, అదే దేవుడిగా మారుతుంది.దీంతో తాను కాకుండా ఇంకో దేవుడు ఉండటం నచ్చని దొర అప్పుడు ఏం చేసాడు. మూఢనమ్మకాలతో బతుకుతున్న అక్కడి ప్రజలకు ఆ రేడియో ద్వారా ఓ స్కూల్ మాస్టర్ వారికి ఎలా విముక్తి కలిగించాడు అనేది మిగిలిన కథ.
ఈ సినిమాను రాజమౌళి శిష్యుడు అయిన అశ్విన్ గంగరాజు రూపొందించారు. అయితే ఈ మూవీలో నటించిన వారిలో చాలా మంది కొత్తవారు కావటం, అంతేకాకుండా సబ్ స్క్రైబర్లు తక్కువ సంఖ్యలో ఉన్న సోనీ లివ్ లాంటి ఓటీటీలో విడుదల అవడం కూడా ఆకాశవాణికి మైనస్ అయ్యిందనే చెప్పాలి.కానీ ఓటీటీలో మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఆకాశవాణి మంచి ఆప్షన్ అవుతుంది.






















