భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టు ఇంగ్లాండ్ పైన ఐదు టెస్టులు సీరీస్ ను ఆడుతుంది. సిరీస్ లో మొదటి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరిగింది. అయితే మ్యాచ్ ఆద్యంతం భారత జట్టుకు అనుకూలంగానే ఉన్న చివరికి వచ్చేసరికి తిరిగిపోయింది. భారత్ ను ఓడించి ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ కైవసం చేసుకుంది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన భారత్ ఇంగ్లాండ్ స్పిన్నర్లు దాటికి నిలవలేక 202 పరుగుల కి కుప్పకూలింది.
నాలుగు రోజులు కొనసాగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదటి రెండు రోజులు భారత్ జట్టు ఆధిపత్యం కొనసాగింది. బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను మంచి ప్రదర్శన కొనసాగించింది. అయితే ఆఖరి రెండు రోజులు మాత్రం పేలవమైన బ్యాటింగ్, ఫీల్డింగ్ తో నిరాశపరిచింది. అయితే గెలుపు అంచులు దాకా వెళ్ళిన మ్యాచ్ లో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే అంటూ క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

1. పేలవమైన బ్యాటింగ్:
231 పరుగుల తక్కువ స్కోరును చెందించడానికి భారత జట్టు బ్యాటింగ్ కి దిగింది.ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ లు విఫలమవ్వగా, శుభ్‌మన్ గిల్ సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. అతని వైఫల్యం మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పింది. వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో తర్వాత వచ్చిన భారత బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది.ఇదే ఇంగ్లండ్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచి మ్యాచ్ ను చేజార్చుకుంది.
2. చెత్త ఫీల్డింగ్:
ఈ మ్యాచ్ లో భారత్ ఆటగాళ్ళు చెత్త ఫీల్డింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్స్ కి అవకాశాలు కల్పించారు. చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లు వదిలేయడం, సునాయసమైన బౌండరీలను ఆపలేకపోవడం వంటి తప్పిదాలుతో భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఏకంగా 10 బౌండరీలు వదిలేసారు అంటే అర్థం చేసుకోవచ్చు.
3. ఫలించని ప్రయోగం:
అక్షర పటేల్ ను ముందు ఆర్డర్ లో పంపిస్తు చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. నాలుగో స్థానంలో ఆడిన అక్షర ఎక్కువసేపు నిలవలేకపోయాడు. లోయర్ ఆర్డర్ లో వచ్చుంటే పరిస్థితి వేరేలా ఉండేది అని అంటున్నారు.కేఎస్ భరత్, అశ్విన్‌లతో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పేవాడు. భారత విజయానికి కృషి చేసేవాడు.








మిథున్ చక్రవర్తి అసలు పేరు గౌరంగ చక్రవర్తి. ఆయన 1950లో జూన్ 16న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో బెంగాలీ దిగువ మధ్యతరగతి హిందూ ఫ్యామిలిలో జన్మించారు. అతని తల్లిదండ్రులు బసంత కుమార్ చక్రవర్తి, శాంతి రాణి చక్రవర్తి దంపతులకు. అతను ఓరియంటల్ సెమినరీలో చదువుకున్నాడు మరియు తరువాత తన బీఎస్సి కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కళాశాల చేశాడు. ఆ తరువాత, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రుడయ్యాడు.
బెంగాల్ లో నక్సలైట్ ఉద్యమం మొదలైన తరువాత ఇతర వేలాది బెంగాలీ యువకుల లాగానే, మిథున్ కూడా 1960ల చివరలో నక్సల్ పోరాటంలోకి వెళ్లారు. కోల్‌కతాలో నక్సలైట్ పోరాటం జరిగే టైమ్ లో చారు మజుందార్‌తో పనిచేశారు. అయితే నక్సలైట్ల పై పోలీసుల అణిచివేత వల్ల మిథున్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆయన నక్సలైట్ గా మరడంతో ఆయన ఫ్యామిలీ ఆందోళనకు గురైంది. అదే సమయంలో మిధున్ సోదరుడు యాక్సిడెంట్ లో మరణించడంతో తిరిగి ఇంటికి వచ్చిన మిథున్ మళ్ళీ అటు వైపు చూడలేదు.
ఆ తరువాత సినిమాలలో నటించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ అవకాశాలు అంత తేలికగా రాలేదు. ఒక్క పూట భోజనం కూడా దొరికేది కాదు. కొరయోగ్రాఫర్ హెలెన్ దగ్గర చేరారు. స్టేజ్ పై డ్యాన్స్ చేసేవాడు. తన డ్యాన్స్ చూసి అయినా సినిమాలో ఛాన్స్ ఇస్తారేమో అని. ఎన్ని రోజులు 1976లో మృగయా మూవీతో మిథున్ చక్రవర్తి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని సంచలనం సృష్టించారు. ఆ తరువాత పలు సినిమాలలో నటించినా, 1982లో వచ్చిన ‘డిస్కో డాన్సర్’ మూవీతో సూపర్స్టార్డమ్ అందుకున్నాడు.
దేశంలోనే తొలి వందకోట్ల మూవీగా సంచలనం సృష్టించింది. ఈ మూవీతో ఇండియాలోనే కాకుండా రష్యాలో కూడా పాపులారిటీ పొందారు. డ్యాన్స్ స్టార్‌గా పేరు వచ్చింది. ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు చేసి అగ్రహీరోగా మారారు. ఓ దశలో వరుసగా 33 సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన స్టార్ డమ్ చెక్కచెదరలేదు. 1979లో నటి యోగీతా బాలిని వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు మిమోహ్, ఉష్మే చక్రవర్తి , నమషి చక్రవర్తి , దత్తపుత్రిక దిశాని చక్రవర్తి. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిన మిథున్ ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు.
జైలర్ మూవీలో కు విలన్ గా, సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత ఈ మూవీలో నటనతో ఆకట్టుకున్న వ్యక్తి మలయాళ యాక్టర్ వినాయగన్. ఇతను నటుడు మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కూడా. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించే వినాయగన్ పలు తమిళ చిత్రాలలో కూడా నటించారు
వినాయకన్ తొలిసారిగా 1995లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళంలో వచ్చిన ‘మాంత్రికం’ మూవీలో నటించాడు. వినాయకన్ తర్వాత కలి, ఒరుతీ, ట్రాన్స్, మరియు పద వంటి సినిమలలో నటించారు. 2016లో, దర్శకుడు రాజీవ్ రవి తెరకెక్కించిన ‘కమ్మటిపాడమ్‘ లో గంగ పాత్రలో తన నటనకు గాను వినాయకన్ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.
తమిళంలో వినాయకన్ నటించిన ఏడవ సినిమా జైలర్. ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో ఎంత క్రూరంగా ఉంటుందో రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కనిపిస్తుంది. వినాయకన్ తెలుగులో కూడా నటించాడు. అయితే అతను ఒకే ఒక్క సినిమాలో మాత్రమే నటించారు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘అసాధ్యుడు’. అనే సినిమాలో విలన్ నటించాడు.
మహిళా తన శరీరంలో మరో ప్రాణికి జీవం పోసే సమయం, అంటే గర్భం ధరించే సమయంలో ఆమె శరీరంలో పలు మార్పులు కనిపిస్తుంటాయి. ఈ మార్పులు సహజంగా ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి స్త్రీలోను కనిపిస్తాయి. కానీ అందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించాలని లేదు. గర్భధారణ మొదట్లోనే ఈ మార్పులు మొదలవుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చినపుడు పీరియడ్స్ ఆగిపోతాయి. ఇదే గర్భధారణకు ముఖ్యమైన సంకేతం. అయితే ఇతర కారణాల వల్ల కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో ఉదయం లేవగానే వీక్ గా అనిపించడం, వికారంగా ఉండడం, తిన్న వెంటనే వాంతులు అయినట్లుగా అనిపిస్తుంది. నోటికి రుచిగా అనిపించదు. పుల్లని ఆహార పదార్ధాలు తినాలనిపిస్తుంది. మామూలు సమయంలో కన్నా ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ సార్లు టాయిలెట్‌కి వెళ్తుంటారు. ప్రెగ్నెన్సీ టైమ్ లో రక్త ప్రవాహం పెరుగుతుంది. అది తలనొప్పి రావడానికి కారణమవుతుంది. ప్రెగ్నెన్సీ మొదట్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలలో ఇది కూడా ఒకటి. ప్రెగ్నెన్సీ సమయంలో బాడీ టెంపరేచర్ సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉంటుంది.
అది మాత్రమే కాకుండా ఈ టైమ్ లో వారి మానసిక స్థితి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. చికాకు పెరుగుతుంది. అలాగే గర్భధారణ సమయంలో శరీరంలో హార్మోన్లలో మార్పులు ప్రారంభం అవుతాయి. దానివల్ల శరీర భాగాల్లో మార్పు పెరుగుదల కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు యూరిన్ టెస్ట్ కిట్ లేదా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవచ్చు. కానీ, కొన్నిసార్లు ఈ కిట్ సరైన ఫలితాన్ని చూపదు. డాక్టర్‌ను సంప్రదించి ప్రెగ్నెన్సీని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
సాలూరు శ్మశాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్మశాన అభివృద్ధి కోసం మా కమిటీ నిధులను సేకరిస్తుంటుందని తెలిపారు. నిధుల సేకరణలో భాగంగానే తెలంగాణ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ను సూర్యాపేట కలెక్టర్ ద్వారా తమ కమిటీ సంప్రదించింది. అలా ఎంపీ లింగయ్య ‘ఎంపీ ల్యాడ్స్’ నిధుల నుండి 10 లక్షల రూపాయలు సాలూరు శ్మశాన అభివృద్ధి పనులకు ఇచ్చారు. అయితే ఆ నిధులు సాలూరు పురపాలక సంఘానికి 2023 డిసెంబర్లో చేరాయి. దాంతో గత వారం నుండి సాలూరు శ్మశానంలో పనులు చేపట్టారు.
ఈ విషయం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ “రాజ్యసభ సభ్యులు తమ నిధులతో దేశంలో ఎక్కడైనా అభివృద్ధి పనులకు సహాయం చేయవచ్చు. ఆ క్రమంలోనే సాలూరు శ్మశాన అభివృద్ధి కోసం నిధులు ఇచ్చానని వెల్లడించారు. ఇది మంచి పని, చిన్న పని కావడంతో ఇచ్చాను. ఈ విషయంలో రాజకీయం లేదని అన్నారు.
69 ఏళ్ల శశి సోని భారత మహిళా వ్యాపారవేత్తల లిస్ట్ లో సుపరిచితమైన పేరు. మహిళా పారిశ్రామికవేత్త శశి సోనీ ఇజ్మో లిమిటెడ్ వ్యవస్థాపకురాలు. ఆమె కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ సొల్యూషన్ ప్రొవైడర్. పద్మశ్రీ కన్నా ముందు, ఆమె అనేక అవార్డులతో గౌరవించబడింది. ఆమె 1990లో మహిళా గౌరవ్ అవార్డును అందుకుంది.శశి సోనీ పాకిస్తాన్లో 1941లో ఏప్రిల్ 4న లాహోర్‌లో జన్మించారు. అయితే ఆమెకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె ఫ్యామిలీ ఢిల్లీకి వచ్చింది. అలా ఆమె విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది.
శశిసోనీ 1971లో 30 సంవత్సరాల వయసులో సొంతంగా బిజినెస్ మొదలుపెట్టారు. 10,000 రూపాయల పెట్టుబడితో ‘డీప్ ట్రాన్స్పోర్ట్’ను మొదలుపెట్టారు. ఆ వ్యాపారాన్ని 1975 వరకు కొనసాగించారు. ఆ తర్వాత అదే ఏడాది ముంబైలోని ములుంద్ ఏరియాలో ‘దీప్ మందిర్ సినిమా’ అనే తొలి ఏసీ థియేటర్‌ను మొదలుపెట్టారు. దీనిని ఆమె 1980 వరకు నడిపించారు. వ్యాపారం ప్రారంభించిన మొదట్లో ఆమె అసమానతలతో పోరాడేలా చేసింది. డీప్ ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించే వరకు ఆమె పోరాటం కొనసాగింది.
మైసూర్‌లోని స్థాపించిన పారిశ్రామిక గ్యాస్ తయారీ మరియు చిన్న తరహా గ్యాస్ తయారీతో ఆమె శ్రమ ఫలించి, ఆదాయం సమకూరింది. ఆ తరువాత సాంకేతిక రంగంలో ఆమె అడుగుపెట్టారు. ఇప్పుడు ఇంటరాక్టివ్ మార్కెటింగ్ సొల్యూషన్స్‌లో ప్రపంచ అగ్రగామి ఉన్న ఐజెడ్ఎంఓ లిమిటెడ్ కంపెనీని 2005లో స్థాపించారు.
ప్రస్తుతం ఈ కంపెనీ యూరప్, అమెరికా, ఆసియాలో హైటెక్ ఆటోమోటివ్, ఇ-రిటైలింగ్ సొల్యూషన్లను అందిస్తుంది. ఈ కంపెనీకి శశి సోనీ చైర్పర్సన్. ఈ కంపెనీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లిస్ట్ లో చేరింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 4,150 కోట్ల రూపాయలకు చేరింది.శశి సోనీ డీప్ జనసేవా సమితి మెంబర్. వ్యవస్థీకృత ఉద్యోగాలు, మహిళలకు ఉద్యోగాలు, పెన్షన్ పథకాలు ప్రారంభించడం, శారీరక వికలాంగులకు నిధులు సమీకరించడం మొదలైన వాటి ద్వారా సమాజానికి అపారమైన కృషి చేస్తోంది.