ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న స్మశానానికి నిధులు ఇచ్చిన తెలంగాణ ఎంపీ ఎవరు..? అసలు వివాదానికి కారణం ఏంటి..?

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న స్మశానానికి నిధులు ఇచ్చిన తెలంగాణ ఎంపీ ఎవరు..? అసలు వివాదానికి కారణం ఏంటి..?

by kavitha

Ads

ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరులోని శ్మశానం అభివృద్ధి పనులలో భాగంగా గోడలకు రంగులు వేయడం, కొత్తగా దహనవాటికల యొక్క నిర్మాణంతో పాటు మొక్కల పెంపకం లాంటి పనులు చకచక జరుగుతున్నాయి.

Video Advertisement

అయితే ఈ శ్మశానం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ శ్మశాన అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ఎంపీ నిధులు ఇవ్వడం వివాదానికి కూడా దారి తీసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, సాలూరు  దేశంలోనే లారీ పరిశ్రమకు పేరు గాంచింది. ఈ ప్రాంతానికి చెందిన పీడిక రాజన్నదొర ఏపీకి ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్ గా పనిచేస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సాలూరులోని శ్మశాన అభివృద్ధికి, తెలంగాణ ఎంపీ నిధులు ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలోని ఎంపీలు, ఇతర లీడర్లు, గవర్నమెంట్ ఏం చేస్తోందని విమర్శలు ప్రారంభం అయ్యాయి.
సాలూరు శ్మశాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్మశాన అభివృద్ధి కోసం మా కమిటీ నిధులను సేకరిస్తుంటుందని తెలిపారు. నిధుల సేకరణలో భాగంగానే  తెలంగాణ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ను సూర్యాపేట కలెక్టర్ ద్వారా తమ కమిటీ సంప్రదించింది. అలా ఎంపీ లింగయ్య ‘ఎంపీ ల్యాడ్స్’ నిధుల నుండి  10 లక్షల రూపాయలు సాలూరు శ్మశాన అభివృద్ధి పనులకు ఇచ్చారు. అయితే ఆ నిధులు సాలూరు పురపాలక సంఘానికి 2023 డిసెంబర్‌లో  చేరాయి. దాంతో గత వారం నుండి సాలూరు శ్మశానంలో పనులు చేపట్టారు.
ఈ విషయం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ “రాజ్యసభ సభ్యులు తమ నిధులతో దేశంలో ఎక్కడైనా అభివృద్ధి పనులకు సహాయం చేయవచ్చు. ఆ క్రమంలోనే సాలూరు శ్మశాన అభివృద్ధి కోసం నిధులు ఇచ్చానని వెల్లడించారు. ఇది మంచి పని, చిన్న పని కావడంతో ఇచ్చాను. ఈ విషయంలో రాజకీయం లేదని అన్నారు.


End of Article

You may also like