అయోధ్యలో జరిగిన అద్భుత సంఘటన.. పోయిన పర్స్ 680 కిలోమీటర్ల దూరంలో దొరికింది..ఎలాగంటే.?

అయోధ్యలో జరిగిన అద్భుత సంఘటన.. పోయిన పర్స్ 680 కిలోమీటర్ల దూరంలో దొరికింది..ఎలాగంటే.?

by Harika

Ads

జనవరి 22న అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు దేశవ్యాప్తంగా పలుమూలల నుంచి విపరీతమైన జనసంఖ్య అయోధ్యకు బాల రాముని దర్శనం కోసం హాజరయింది. అందులో ఒక ముసలి వృద్దురాలు శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కోసం వెళ్లి తన పర్సుని పోగొట్టుకుంది. ఆ పర్సు నిండా నోట్లు ఉన్నాయి అని తెలిపింది ఆ ముసలావిడ.

Video Advertisement

టీవీ 9 కథనం ప్రకారం..వివరాలలోకి వస్తే తమిళనాడుకు చెందిన బిలియనర్ శ్రీధర్ వెంబు తన తల్లి జానకి తో కలిసి అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ట కి వెళ్లారు. జానకికి 80 ఏండ్లు నిండాయి. బాలరాముడు దర్శనం కోసం వెళ్తుండగా తన పర్సు పోయింది అని తనకి తెలిసింది. అందులో 63 వేల విలువ కలిగిన నగదు, ఆధార్ కార్డు కూడా ఉన్నాయి. బాలరాముడి దగ్గరకు వెళ్లి తన పర్స్ తిరిగి రావాలి అని కోరుకుంది జానకి.

శ్రీధర్ అక్కడ ఉన్న పోలీసులకు పర్స్ పోయిందన్న విషయం తెలిపారు వాళ్లు ఆ పర్స్ కోసం గాలిస్తామని చెప్పారు. శ్రీధర్ తన తల్లి జానకి తో తిరిగి తమిళనాడు వచ్చేశారు. చూస్తే ఆ పర్స్ 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిద్వార్ కు చెందిన ఒక సాధువు దగ్గర ఉంది. తను కూడా బాలరాముడు ప్రాణ ప్రతిష్ట కోసం అయోధ్యకు వచ్చినప్పుడు తెలియకుండా తన సంచిలో ఈ పర్స్ పడిపోయిందని. చూడగా అందులో జానకి ఆధార్ కార్డు ఉందని వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తెలిపారు.

ఆ పైన పోలీసులు శ్రీధర్ కి ఈ విషయం తెలుపగా వాళ్ళు వచ్చి ఆ పర్స్ నీ తీసుకున్నారు. అందులో డబ్బులు ఆధార్ కార్డుతో పాటు ఒక చిన్న గంట కూడా ఉందని ఆ గంట జానకి పూజ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడూ ముఖ్యమైన సామాగ్రి అని, ఇది తిరిగి తన దగ్గరికి రావడానికి కారణం శ్రీరాముడే. తనే స్వయంగా ఇది నా దగ్గరికి వచ్చేలా చేశారు అని నమ్ముతుంది జానకి. ఈ విషయం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ రాముడి అనుగ్రహమే ఇది అని కామెంట్ చేస్తున్నారు.


End of Article

You may also like